మండలంలో… పెద్ద ఎత్తున ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
1 min readఆలూరు తెదేపా ఇన్చార్జి వీరభద్ర గౌడ్
హొళగుంద మండలంలో పెద్ద ఎత్తున ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
పల్లెవెలుగు వెబ్ హొళగుంద : హొళగుంద మండల కేంద్రంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టారు.ఈ కార్యక్రమానికి అలూరు తెదేపా ఇంచార్జ్ వీరభద్ర గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇన్చార్జి వీరభద్ర గౌడ్ ను స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. ముందుగా వాల్మీకి విగ్రహానికి ఇన్చార్జి వీరభద్ర గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వాల్మీకి సర్కిల్ నుండి తేరుబజారులోని మురళి రైస్ మిల్ ఆవరణంలో ఏర్పాటు చేసిన సభ ప్రాంగణం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సభకు డివిజనల్ అభివృద్ధి ప్రత్యేక అధికారి నాగేశ్వరరావు, ఏపీఓ భక్తవత్సల్యం, వ్యవసాయ ఆలూరు ఏడిఏ సునీత, కర్నూలు ఏడిఏ వేదమణి, హోళగుంద మండల వ్యవసాయ అధికారి ఆనంద్ లోకదళ్, పంచాయతీ సర్పంచ్ చలువాది రంగమ్మ, మేజర్ పంచాయితీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్, ఎంపీడీవో సుహాసినిమ్మ, హౌసింగ్ ఏఈ వర్మ, ఎస్సై బాల నరసింహులు హాజరయ్యారు. సభను ఉద్దేశించి డి ఎల్ డి ఓ నాగేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి వంద రోజుల్లోనే ప్రజల మన్నన పొందుతుందని అన్నారు.ఈ కార్యక్రమానికి మండల తెదేపా, బిజెపి, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.