ఇది మంచి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం
1 min readహొళగుంద మండలం హొళగుంద గ్రామ పంచాయతీ నందు ఆలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వీరభద్ర గౌడ్
పల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలంహొళగుంద గ్రామ సచివాలయంలో అదికారులతో కలిసి ఇది మంచి ప్రభుత్వం గ్రామ సభలో పాల్గొన్న విరభద్ర గౌడ్ అనంతరం తానే స్వయంగా ప్రతి ఇంటింటికి వెళ్లి ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్ లను అంటించి కరపత్రాలను పంపిణీ చేసి ఈ వందరోజుల ప్రభుత్వం చేసిన మంచి పనులను వివరించారు.అలాగే : పొలం పిలుస్తుంది కార్యక్రమం. మరియు సీసీ రోడ్లు నిర్మాణం కొరకు భూమి పూజ చేశారు . ఈ కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ 2024 జూన్ 12న శ్రీ నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సెప్టెంబర్ 20వ తేదీకి 100రోజులైంది. రాష్ట్ర ఖజానాను జగన్ రెడ్డి దివాళా తీయించినా 100 రోజుల్లోనే 100కు పైగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేశారు. మొదటి వందరోజుల్లో జగన్ ప్రభుత్వం రూ.250 పెన్షన్ పెంచడం తప్ప మరే ఇతర హామీని అమలు చేయలేదు. మళ్లీ జగనే వచ్చి ఉంటే కరెంట్ ఛార్జీల బాదుడు, కరెంటు కోతలు పెరిగి ఉండేవి. ప్రజల ధన, మాన, ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ ఉండేది కాదు. పింఛన్ రూ. 3 వేలకే పరిమితమై ఉండేది. నేడు చంద్రన్న చల్లని పాలనలో ప్రజలు స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారు, ఈ కార్యక్రమంలో సర్పంచ్ చలవాది రంగమ్మ, ఎస్సై శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్, రైస్ మిల్ మురళి, టిడిపి సీనియర్ నాయకులు పంపాపతి, దుర్గయ్య, ఎర్రి స్వామి, అబ్దుల్ సుభాన్, ముళ్ళ మోయిన్, ద్వారక, కాడప్ప, ఆంజనేయులు, గవి సిద్ధప్ప, జాకీర్, అత ఊరు రహిమాన్, సలీం, వెంకటేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.