కలిసుంటే కలదు సుఖం…డిఎస్పీ ఉపేంద్ర బాబు
1 min readగ్రామ అభివృద్ధి కి ఎంప్లాయిస్ యూనియన్ కృషి
మహేంద్ర నాయక్
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: గ్రామాలు అభివృద్ధి చెందాలన్న ప్రజలు సంతోషంగా ఉండాలన్న అందరు కలిసి ఉండాలని కలిసుంటే కలదు సుఖం అని ఎమ్మిగనూరు డిఎస్పీ ఉపేంద్ర బాబు అన్నారు. గురువారం మండల పరిధిలోని మాధవరం తండా గ్రామంలో దీపావళి సందర్భంగా గ్రామానికి చెందిన ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన 5 కే రన్ కార్యక్రమానికి మంత్రాలయం సిఐ రామాంజులు తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీరి కి గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలిసుంటే కరదు సుఖం అని పెద్దలు అన్నారని తెలిపారు. అందరం కలిసి ఉంటే గ్రామం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఎంప్లాయీస్ యూనియన్ చేపట్టిన ఈ కార్యక్రమం తో మీ గ్రామం అన్ని గ్రామాలకు ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో పారిశుధ్యం పరిశుభ్రంగా ఉంచాలని చెట్లను పెంచితే పచ్చదనం తో పాటు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఒకరి మీద ఆధారపడ కుండా స్వశక్తి తో ఎదగాలని సూచించారు. మీరందరూ కలిసి ఈ కార్యక్రమం చేస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు.గ్రామ అభివృద్ధి కి ఎంప్లాయీస్ యూనియన్ కృషి : – మాధవరం తండా గ్రామ అభివృద్ధి కి గ్రామ ప్రజల సహకారంతో కృషి చేస్తామని ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు మహేంద్ర నాయక్ అన్నారు. గ్రామానికి చెందిన సుమారు వంద మంది ఉద్యోగులు ఎక్కడెక్కడో ఉంటారని అయితే దీపావళి పండగ రోజు అందరు ఇక్కడ కలుసుకుంటారని తెలిపారు. ఇలా కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మా డిఎస్పీ ఉపేంద్ర బాబు, సిఐ రామాంజులు, మంత్రాలయం ఎస్ఐ పరమేష్ నాయక్, మాధవరం ఎస్సై విజయ కుమార్ మా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. వారి కి గ్రామ ప్రజలు, ఎంప్లాయీస్ యూనియన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ముఖ్య అతిథులుగా హాజరైన వారికి శాలువ కప్పి పూలమాలలు వేసి మొమొంటో తో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి లక్ష్మి బాయి, టీచర్ కొండారెడ్డి, శ్రీనివాసులు, రంగనాయక్, ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.