10 లక్షల మందిలో ఇద్దరికే వచ్చే అరుదైన వ్యాధి
1 min read11 ఏళ్ల బాలుడికి ఆటో ఇమ్యూన్ ఎన్‌సెఫలైటిస్
కింగ్‌కోఠి కామినేని ఆస్పత్రిలో విజయవంతంగా చికిత్స
రెండు వారాలకు మించి జ్వరం ఉంటే జాగ్రత్త
వెంటనే టీబీ, ఇతర పరీక్షలు చేయించాలి
న్యూరోఫిజిషియన్ డాక్టర్ అవినాష్ కుమార్ సూచన
పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్ : పిల్లల్లో ప్రతి పది లక్షల మందికి గాను కేవలం ఇద్దరికి మాత్రమే వచ్చే అత్యంత అరుదైన వ్యాధి.. ఆటో ఇమ్యూన్ ఎన్‌సెఫలైటిస్. అంటే మన శరీరంలో ఉండే రోగ నిరోధక శక్తే మనకు వ్యతిరేకంగా పనిచేయడం వల్ల వచ్చే మెదడుకు సంబంధించిన సమస్య. నగరంలో 11 ఏళ్ల బాలుడికి వచ్చిన ఇలాంటి సమస్యకు కింగ్ కోఠిలోని కామినేని ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ అవినాష్ కుమార్ అడ్డోజు విజయవంతంగా చికిత్స చేసి, బాలుడికి నయం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు తెలిపారు. “హైదరాబాద్‌లోని కర్మన్ ఘాట్ ప్రాంతానికి చెందిన ఆర్యన్ అనే ఈ 11 ఏళ్ల బాలుడికి సుమారు నెల రోజుల నుంచి తీవ్రమైన జ్వరం, దానికితోడు ఫిట్స్ వస్తున్నాయి. తొలుత తమకు సమీపంలోని చిన్న ఆస్పత్రులలో చూపించారు. ఫిట్స్ తగ్గకపోవడం, జ్వరం కూడా పదే పదే రావడంతో ఆందోళన చెంది.. కింగ్ కోఠిలోని కామినేని ఆస్పత్రికి వచ్చారు. ఇక్కడకు వచ్చేసరికి బాబు ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగోకపోవడంతో ముందుగా అతడిని వెంటిలేటర్ మీద పెట్టి చికిత్స ప్రారంభించాం. తొలుత మెదడుకు ఎంఆర్ఐ తీసి బ్రెయిన్ టీబీ ఉందేమోనని చూశాం. అదేమీ లేదు. అప్పటికి మందులు ఇస్తున్నా బాలుడి శరీరం పెద్దగా ఏమీ స్పందించడం లేదు. దాంతో అనుమానం వచ్చి, మెదడుతో సహా శరీరం అంతటికీ పెట్ సీటీ స్కాన్ చేయించాం. అప్పుడు మేం అనుమానించినట్లు గానే ఆటో ఇమ్యూన్ ఎన్‌సెఫలైటిస్ అని తేలింది. ఇది అత్యంత అరుదైన వ్యాధి. ప్రతి పది లక్షల మంది పిల్లల్లో కేవలం ఇద్దరికి మాత్రమే వస్తుంది. అందువల్ల దీని లక్షణాలు కూడా పెద్దగా అందరికీ తెలియవు. రెండు వారాలకు మించిన జ్వరం, ఆగకుండా ఫిట్స్ రావడం లాంటి లక్షణాలుంటే వెంటనే అనుమానించి ఈ పరీక్షలు చేయిస్తేనే బయటపడుతుంది. దీనికి మూడు రకాలుగా చికిత్స చేయాల్సి వచ్చింది. ముందుగా ప్లాస్మా మార్పిడి చేయడం జరిగింది, అందువలన శరీరం లో ఏర్పడిన ఆటో యాంటీబాడీస్ ఫిల్టర్ చేయడం జరిగింది . ఈ విధముగా ప్లాస్మా ఎక్స్చేంజి తో 5 దశల్లో రోజు తప్పించి రోజు స్టెరాయిడ్లతో చికిత్స (Pluse Theraphy) చేయడము జరిగింది. రోగికి కొంచెము మార్పు వచ్చాక , ఇమ్యునోగ్లోబులిన్ మందులు ఐవీ ద్వారా ఇచ్చాము , 2 Grams per KG చొప్పున రోగి శరీర బరువును బట్టి లెక్కించి, ఎంత డోసులో ఇవ్వాలన్నది నిర్ణయించి. ఒకరకంగా టైలర్ మేడ్ చికిత్సలు. అంటే ఈ రోగికి సరిగ్గా సరిపోయేలాంటి మందుల డోసులు నిర్ధారించి వాటినే ఇచ్చాము . ఈ చికిత్సలు చేయడం వల్ల బాలుడికి పూర్తిగా నయమైంది. మొత్తం చికిత్సకు, ఆర్యన్ పూర్తిగా కోలుకోవడానికి దాదాపు నెల రోజులు పట్టింది. ఇప్పుడు వెంటిలేటర్ తీసేసి, అన్నిరకాల మందులు కూడా ఆపివేసి ,అతడిని సాధారణ స్థితికి తీసుకొచ్చాము ” అని డాక్టర్ అవినాష్ కుమార్ అద్దోజు వివరించారు.ఆర్యన్ తల్లి సాధారణ గృహిణి కాగా, తండ్రి చిన్నపాటి వ్యాపారం చేసుకుంటారు. తమ కుమారుడికి వచ్చిన ఇంత పెద్ద సమస్యను సమర్థవంతంగా నయం చేసి, మళ్లీ మామూలు మనిషిని చేసినందుకు కింగ్ కోఠి కామినేని ఆస్పత్రికి, డాక్టర్ అవినాష్ కుమార్‌కు, వైద్య సిబ్బందికి వారు కృతజ్ఞతలు తెలిపారు. పిల్లలకు ఎప్పుడైనా రెండు వారాలకు మించి జ్వరం వస్తున్నా, ఫిట్స్ లాంటి ఇతర లక్షణాలు ఉన్నా వెంటనే తల్లిదండ్రులు అప్రమత్తం కావాలని, బ్రెయిన్ టీబీ లాంటి సమస్యలు ఉన్నాయేమో పరీక్షించుకోవాలని డాక్టర్ అవినాష్ కుమార్ అద్దోజు సూచించారు. ప్రస్తుతం నగరంలో పలు రకాల జ్వరాలు ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.For media; please contact Giri @ 99634 45785.