భవ సాగరాన్ని దాటించేది భగవన్నామమే
1 min readడాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే
ఘనంగా ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రాపంచిక మాయ నుండి శాశ్వతమైన ఆనందాన్ని కలిగించేది భగవంతుడి నామమేనని, అటువంటి భగవన్నామస్మరణ ప్రతిజీవి అలవరచుకోవలెనని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు మండలం, రాళ్ళదొడ్డి గ్రామంలోని శివాలయం నందు గత ఐదు రోజులుగా జరుగుతున్న ధార్మిక ఆధ్యాత్మిక సాంస్కృతిక అత్యంత భక్తిశ్రద్ధలతో ముగిశాయి. మూడు రోజులపాటు శ్రీమద్రామాయణం మహాభారతం భగవద్గీతలపై డి. జగదీశ్ చేసిన ధార్మిక ప్రవచనాలు భక్తులను అలరించాయి. ఈ కార్యక్రమంలో విశ్వహిందు పరిషత్ ప్రఖండ అద్యక్షులు సత్యనారాయణ రెడ్డి, మురళి, నర్సన్న, సోమిరెడ్డి, అర్చకులు శ్రీరాములుయాదవ్, గొల్ల గోవిందు, డి.జి వీరన్న, చిన్న తిమ్మప్ప, సోమిరెడ్డి, బోయ వీరేసు, ఈశ్వరయ్య, బోయ వెంకటేశ్ , బోయకాశిమన్న, వీరన్న, చిన్న తిమ్మప్ప, రామకృష్ణ, రమేష్, తిమ్మప్ప, పెద్ద తిమ్మప్ప, బోయశీను, వీరేశ్, కరుణాకర్ రెడ్డి, చెన్నారెడ్డి, భాస్కర్, రవికుమార్, ఈశ్వరయ్య, మూకి తిమ్మప్పతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.