మహానంది దేవస్థానంలో పలుకుబడి ఉంటే చాలు…
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: మహానంది దేవస్థానంలో పలుకుబడి ఉంటే చాలు…. ఏ ఉద్యోగమైనా చేయొచ్చు. కాకపోతే రెండు ఉన్నతస్థాయి ఉద్యోగాలు తప్ప. సాధారణంగా ఏజెన్సీ ఉద్యోగులను అధిక శాతం పారిశుద్ధ్య పనుల కోసం తీసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం పేరుకే పారిశుధ్య పనులు. చేయించేది మాత్రం అధికార దర్పంతో పర్మినెంట్ ఉద్యోగులపై నిఘా తో పాటు పర్మినెంట్ ఉద్యోగుల స్థానంలో ఏజెన్సీ ఉద్యోగులు, ఏజెన్సీలు చేయాల్సిన స్థానంలో పర్మినెంట్ ఉద్యోగులను నియమించడం సర్వసాధారణంగా మారింది. కారణం ఏమంటే మేము ఫలానా వారి చేత నియమింపబడ్డామని పారిశుద్ధ్య పనులు చేయమని కరాకండిగా అధికారుల ముందే పేర్కొంటున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. దీంతో అధికారులు తల పట్టుకుని పర్మినెంట్ ఉద్యోగులు చేయాల్సిన పనులను ఏజెన్సీ వారితో చేయిస్తూ ఉండటమే కాక ఏజెన్సీ సిబ్బంది కింద పర్మినెంట్ ఉద్యోగులు పనిచేసే విధంగా చేస్తున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. కనీసం నెలరోజులు గడవక ముందే కొందరిని పని కట్టుకొని ఆలయంలో అంతర్గత బదిలీలలు జరుగుతున్నాయని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అయినవారికి ఆకుల్లో కానీ వారికి కంచాల్లో పటిస్తారని సామెతగా కొందరు పర్మినెంట్ ఉద్యోగులను బదిలీలలు చేస్తున్నారని తెలుస్తుంది.