అందుల ఆహాభావాలను, మనోభావాలను అవహేళన చేయడం బాధాకరం
1 min readవిజువల్లి చాలెంజ్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎస్ వీరభద్రరావు, జనరల్ సెక్రెటరీ కె మదన్
అవస్తవాలను ప్రచురించడం బాధాకరం
సమయానికి ముందే హాజరైన జిల్లా కలెక్టర్
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: ఏలూరులోని కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న గోదావరి మీటింగ్ హాలులో బ్రెయిలీ లిపి సృష్టికర్త అంధుల ఆశాజ్యోతి వర్ లూయిస్ బ్రెయిలీ గారి 216వ జన్మదినోత్సవ వేడుకలను అసిస్టెంట్ డైరెక్టర్, విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, ఏలూరు జిల్లా మరియు విజువల్లీ చాలెంజ్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్, విజువల్లీ చాలెంజ్ యూత్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి ఏలూరు జిల్లా కె విట్రీస్ సెల్వి ని ముఖ్య అతధిగా మా సంఘం తరపున ఆహ్వానించి మధ్యాహ్నం 12 గంటలకు కార్యక్రమంలో పాల్గొనవలసినదిగా కోరేమని తెలియజేశారు. కార్యక్రమానికి కలెక్టర్ తమకిచ్చిన సమయానికంటే ముందే హాజరయ్యారని తెలియజేశారు. ఒక ప్రముఖ దిన పత్రికలో మేము నిద్రిస్తున్నట్టు,నిరీక్షిస్తున్నట్టు వ్యాసం రాస్తూ ఫోటోను ముద్రించి అందులైన మా హావభావాలను అవహేళన చేసే విధంగా విద్రపోతున్నట్లు చూపించి కలెక్టర్ రాక కోసం నిరీక్షణ అనే శీర్షికతో అవాస్తవాలను ప్రచురించారని అన్నారు. ప్రముఖ పత్రికలో ప్రచురించబడిన క్లిప్పింగ్స్ పై విజివల్లి ఛాలెంజ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జిడివిఎస్ వీరభద్రరావు, జనరల్ సెక్రెటరీ కె. మదన్ తీవ్రంగా ఖండించారు. అందుల యొక్క హావభావాలను హేళన చేయడం అత్యంత బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. మేము రమ్మన్ని సమయాని కంటే కలెక్టర్ ముందే మా కార్యక్రమానికి వచ్చి అంధులైన మా మీద ఉన్నటువంటి ప్రత్యేకమైన ప్రేమను నిరూపించి. మాకు కావలసిన అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం ద్వారా అందజేస్తామని ఉన్నతంగా ఎదగాలని కొనియాడుతూ ప్రశంసించారన్నారు. నిబద్ధత గల అధికారులపై ఆవాస్తవాలను ప్రచురించి ప్రచారం చేయడం బాధాకరం అని తెలియచేసారు.ఈ విషయాన్ని మేము ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి దృష్టికి కూడా తీసుకువెళ్ళబోతున్నాము అని తెలియచేసారు. దయచేసి పత్రికా యజమాన్యాలు వార్తలు ప్రచురించే క్రమంలో ఆవాస్తవాలను ప్రచురించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అటువంటి ఆవాస్తవాలను ప్రచురిస్తున్నటువంటి విలేకర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. మా స్పందనను కూడా ప్రముఖ పత్రిక ఇదే విధంగా తమ పత్రికలో ప్రచురించాలని విజువల్లి ఛాలెంజ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జె.డి.వి.యస్. వీరభద్రరావు, జనరల్ సెక్రెటరీ కె మదన్, అసోసియేట్ ప్రెసిడెంట్ ఆర్. కర్ణుడు, ట్రెజరర్ డి రామారావు మరియు సభ్యులు పాల్గొన్నారు.