అన్నదాతను నట్టేటా ముంచిన కూటమి ప్రభుత్వం
1 min read13న కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యకారం
పోస్టర్లు విడుదల చేసిన ఎమ్మిగనూరు నియోజకవర్గ వైయస్ఆర్ సిపి ఇంచార్జ్ శ్రీమతి బుట్టా రేణుక
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : పట్టణంలొని శిల్పా ఎస్టేట్ నందు గల పార్టీ కార్యాలయంలొ వైయస్ఆర్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఎమ్మిగనూరు నియోజకవర్గ వైయస్ఆర్ సిపి ఇంచార్జ్ శ్రీమతి బుట్టా రేణుక “అన్నదాతను నట్టేటా ముంచిన కూటమి” ప్రభుత్వంపై రైతులతో కలసి రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్ సీపీ 13.12.2024 తేదీన కలెక్టర్ల కార్యాలయాల ముందు తలపెట్టిన నిరసన కార్యక్రమం యొక్క పోస్టర్లను విడుదల చేశారు.మీడియా సమావేశంలో ఎమ్మిగనూరు నియోజకవర్గ వైయస్ఆర్ సిపి ఇంచార్జ్ శ్రీమతి బుట్టా రేణుక మాట్లాడుతూ అన్నదాతా సుఖీభవ అంటూ ఏడాదికి రూ.20వేలు ఇస్తామంటూ రైతులతో ఓట్లేయించుకుని వారిని దగాచేసి పచ్చి మోసం చేసిందని ఖరీఫ్ ముగిసింది, రబీ వచ్చింది అయినా అన్నదాత సుఖీభవ పెట్టుబడి సహాయం అందక రైతులు గగ్గోలు పెడుతున్న బడ్జెట్లో రూ.10,700 కోట్లు పెట్టాల్సి ఉండగా దాని ప్రస్తావనే లేదని.జగనన్న హయాంలో ఏటా క్రమం తప్పకుండా డా” వైయస్సార్ రైతు భరోసా కింద మేనిఫెస్టోలో ఏడాది రూ.12,500 పెట్టింది కాని మరో వేయి పెంచి ఏడాదికి రూ.13,500 చెప్పిన దానికంటే మిన్నగా ఐదేళ్లలో 53.52లక్షల మందికి రూ.34,288 కోట్ల పెట్టుబడి సహాయం ఇచ్చి గొప్పగా జగనన్న అమలు చేశారని .జగన్ హయాంలో 75 కేజీల బస్తా కనీస మద్దతు ధర రూ.1725లు కాని బాబు పాలనలో రూ.1300ల లోపే రూ.400ల మేర నష్టపోతున్న రైతులు, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో దళారీల సిండికేట్‌గా మారి రైతులను దోచుకుంటున్నారు.ఫోన్లో హాయ్ మెసేజ్ పెడితే చాలన్న మంత్రి రైతులు వేలసార్లు హాయ్‌లు చెప్పినా కరుణించేవారు కనిపించడంలేదని. తద్వారా రైతులపై అదనపు భారం,బీమా కావాలంటే డబ్బు కట్టాల్సిందే విపత్తులు వచ్చినా, అకాల వర్షాలు వచ్చినా రైతులు నష్టపోవాల్సిందే. రైతులపై పైసా భారం పడకుండా 2019-24 మధ్య వైయస్సార్ ఉచిత పంట బీమా ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్ ముగిసేలోపే రైతుల ఖాతాల్లో జమ గడచిన ఐదేళ్లలో 5.42 కోట్ల ఎకరాలకు, 2.04 కోట్ల మందికి బీమా కవరేజీ 54.55 లక్షల మంది రైతులకు రూ.7,802.08 కోట్ల బీమా పరిహారం.జగనన్న హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 10,778 ఆర్బీకేల ద్వారా రైతుల వద్దకే ప్రభుత్వ యంత్రాంగం రైతు సేవలకు కేరాఫ్‌గా నిలిచిన ఆర్బీకేలు అలాంటి గొప్ప వ్యవస్థల నేడు పథకం ప్రకారం నిర్వీర్యం చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం.2014లో కూడా చంద్రబాబు బేషరతుగా పంట రుణ మాఫీ చేస్తానంటూ కుర్చీకోసం హామీలు ఇచ్చి అధికారం దక్కాక రైతులకు మోసం చేశారు మోసాలు చెయ్యడం చంద్రబాబు కొత్తేమి కాదని అది ఆయన నైజమనికూటమి ప్రభుత్వం వెంటనే ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చెయ్యాలని,రంగుమారిన ధన్యాన్ని ఆర్భికెల ద్వారా కొనుగోకు చేసి మద్దత్తు ధరలను అందించి రైతులను ఆదుకోవాలని,ఉచిత పంట భీమా ను అమలు చేసి రైతులపై భారం పడకుండా రైతులని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది అని ఆమె తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వై రుద్ర గౌడ్ ,బిఆర్ బసిరెడ్డి ,నజీర్ అహమ్మద్ ,సునీల్ కుమార్ ,నాగెషప్ప , కేశన్న ,బందే నావజ్ ,కృష్ణ రెడ్డి ,గడ్డం నారాయణ రెడ్డి ,ప్రమోద్ రెడ్డి ,యు కె రాజశేఖర్ ,శివప్ప గౌడ్ ,కోటేకల్ లక్ష్మన్న ,ఎమ్మిగనూరు పట్టణ మరియు మండల, నందవరం మండల,గొనెగండ్ల మండలాల ఎంపిపిలు,జట్పిటీసీలు,కౌన్సలర్లు,సర్పంచులు, వార్డు ఇంచార్జులు,ఎంపిటీసీలు, సచివాలయ కన్వీనర్లు,గృహ సారధులు,పార్టీ అనుబంధ విభాగాల కమిటీ సభ్యులు,నాయకులు, కార్యకర్తలు,అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.