రాజ్యాంగాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
1 min readరాజ్యాంగ తెలుగు అనువాద పుస్తకాన్ని ఆవిష్కరించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ
ఏలూరు పాత బస్టాండ్ వద్దగల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నాయకులు ఘన నివాళులు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: 75వ రాజ్యాంగం సందర్భంగా రాజ్యాంగ పుస్తకము ఆవిష్కరించిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ మరియు నాయకులు. ఏలూరు పాత బస్టాండ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులర్పించారు.అక్కడ నుంచి బైక్ ర్యాలీగా ఏలూరు ఇండోర్ స్టేడియం ఎదురుగా ఉన్న లేడీస్ క్లబ్ నకు చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగ పరిషత్ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ ఎన్ ఏ డి పాల్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మెండెం సంతోష్ కుమార్ మాట్లాడారు. భారతీయులందరికీ రాజ్యాంగమే శిరోధార్యం అని . రాజ్యాంగాన్ని గౌరవించుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యం అన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కల్పించిన హక్కుల వల్లే నేడు మహిళలమైన మేము ప్రజాప్రతినిధులుగా పదవులు చేపట్టే అవకాశం దక్కిందని అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కొరకు అందరం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం భారత రాజ్యాంగం తెలుగు అనువాద పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రముఖ సామాజికవేత్త, కార్మిక ఉద్యమ నాయకుడు కె.వి.బి ఆర్ అంబేద్కర్ ను ఘనంగా సత్కరించారు. సామాజిక న్యాయ జ్వాలా రత్న బిరుదితో ఆయన్ను సత్కరించారు. ఈ సందర్భంగా మాల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, గోపన్నపాలెం పిటి కాలేజ్ ప్రిన్సిపాల్ మతాన్నియల్, ముసునూరు మండలం గోకవరం సర్పంచ్ కంచర్ల వాణి, మహిళా నాయకురాలు స్వరూప, నేతల రమేష్ బాబు లను సత్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నూకపై సుధీర్ బాబు, జక్కుల బెనర్జీ, నాయకులు రెవరెండ్ నిట్టా ప్రసాద్ బాబు, సిరా భగత్ సింగ్, మాముడురి మహంకాళి తదితరులు పాల్గొన్నారు.