PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఫిర్యాదుదారులపైనే చర్యలు చేపట్టడం అన్యాయం

1 min read

పల్లెవెలుగు వెబ్ విజయవాడ: విజయవాడ రైల్వే  డివిజన్లో  అవినీతికి పాల్పడుతున్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవడంమాని  ఫిర్యాదుదారులపైనే చర్యలు చేపట్టడం అన్యాయమని చైతన్య భారతి సర్వీస్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు బి.చిట్టి రాజు ఆరోపించారు. చైతన్య భారతి సర్వీస్ ఆర్గనైజిషన్ అధ్యక్షుడు బి చిట్టి రాజు బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో కొందరు రైల్వే అధికారులు అవినీతి అక్రమాలకు పాలడుతున్నట్లు తోటి రైల్వే ఉద్యోగులు సీబీఐ, విజిలెన్సు దర్యాప్తు సంస్థ లకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఐతే ఫిర్యాదు దారులు అవినీతి అధికారుల పై ఫిర్యాదు చేసే క్రమంలో వారి పేరు,ఉద్యోగ వివరాలు సైతం రాయడంతో విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి   అవినీతి అక్రమాలపై చర్యలు చేపట్టకుండా, ఫిర్యాదు దారుల వివరాలను ఎవరిపై ఫిర్యాదు చేశారో వారికి సమాచారం అందిచడంతో ఆ అధికారులు ఫిర్యాదు చేసిన వారిపై కక్ష పూరిత ధోరణితో సర్వీస్ నుండి తొలగిస్తున్నారని అలా ఇబ్బదులకు గురైన వారిలో చాలామంది తనను సంప్రదించి న్యాయం జరిగేలా చూడాలని విజ్ణప్తి చేయడం జరిగిందని తెలిపారు. నూజివీడు సెక్షన్లో టిఎఫ్ టి ఆర్ మరియు టిఆర్టి పనులలో కోట్ల రూపాయల అవినీతి జరుగుతుందన్నారు. అవినీతి కి పాల్పడుతున్న  సంబంధిత అధికారులపై ఫిర్యాదు చేసిన రైల్వే ఉద్యోగి విక్టర్ బాబు పైనే చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు.ఈ క్రమంలోనే రైల్వే ఉద్యోగి విక్టర్ బాబు తను సెక్షన్ లో జరుగుతున్న అవినీతి పై సంబంధిత అధికారి గురించి విజిలెన్స్ శాఖ కు ఫిర్యాదు చేయగా ఆ విషయం  తెలుసుకున్న ఆ అధికారి వివక్ష తో విక్టర్ బాబు ను సస్పెండ్ చేసారన్నారు. తనకు జరిగిన అన్యాయం పై కోర్టు ను ఆశ్రయించగా మరల న్యాయం జరిగిందని గుర్తు చేశారు. ఎవరైనా రైల్వే ఉద్యోగులు రైల్వేలో జరుగుతున్న అవినీతిగురించి  పై అధికారుల పై ఫిర్యాదు చేసే క్రమంలో ఉద్యోగి పేరు డెసిగ్నేషన్ వెల్లడించకుండా ఫిర్యాదు చేయమని విజ్ఞప్తి చేశారు.

About Author