ఏలూరులో ఘనంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు
1 min readముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
పెద్ద ఎత్తున విచ్చేసిన పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు
జాతీయ రహదారి భద్రత మాస్కోత్సవాల ర్యాలీ జండా ఊపిన ఎమ్మెల్యే బడేటి చంటి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : మానవవనరుల శాఖామాత్యులు, ఐటి, ఏలక్ట్రానిక్స్, రియల్ టైం గవర్నెస్ శాఖామాత్యులు నారా లోకేష్ జన్మదినము సంధర్భంగా ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ అధ్యక్షతన ఐటీ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులగా దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ హాజరు హాజరయ్యారు. ముందుగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారకరామారావు చిత్రపటానికి భారీ పూలమాలు వేసి నివాళులు అర్పించినారు. దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ ఒక దిక్సూచిగా నిలవడానికి కారణమైన స్వర్గీయ ఎన్టీ రామారావు సాధించిన ఘనతగా అదేవిధంగా రాష్ట్రానికి చేసిన సేవలను పేద ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను నాటి నుండి నేటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయలేదని ఎమ్మెల్యేలు, నాయకులు కొనియాడారు. ఆ సంక్షేమ పథకాలు మరోసారి కూటమి ప్రభుత్వంలో జరుగుతుందని అన్నారు. యువనాయకుడు, ఐటీ, మానవ వనరుల శాఖమాత్యులు నారా లోకేష్ జన్మదిన కేక్ నిఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్,ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ భారీ కేక్ కట్ చేశారు.ఈ కార్యక్రమం లో కో- ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మాజీ ఇడ చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, ఏలూరు జిల్లా టీడీపీ కార్యాలయ కార్యదర్శి ఉప్పాల జగదీష్ బాబు, రాష్ట్ర ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, పెద్దిబోయిన శివ ప్రసాద్, రెడ్డీ నాగరాజు,ఘంటా వి వి ప్రసాదరావు,వందనాల శ్రీనివాసరావు, మారం హనుమంతరావు, పూజారి నిరంజన్, గవ్వ బినారాయణరావు,లంకపల్లి మాణిక్యాలరావు, తవ్వా అరుణ కుమారీ మరియు ఇతర తెలుగుదేశం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.