అత్యంత భక్తిశ్రద్ధలతో ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు
1 min readడాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో దొర్నిపాడు మండలం, భాగ్యనగరం గ్రామంలో వెలసిన శ్రీ రామాలయం నందు గత ఐదు రోజులుగా జరుగుతున్న ధార్మిక ప్రవచనాలు, స్థానిక భజన మండలిచే భజన కార్యక్రమాలు, స్థానిక మహిళలచే కుంకుమార్చన మరియు గోపూజ కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో ముగిశాయి. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, ధర్మ ప్రచార మండలి సభ్యులు టి. వి. వీరాంజనేయ రావు, ఆలయ ధర్మకర్త వీరగంధం బ్రహ్మయ్య, అర్చకులు వారణాసి ప్రసాద్ శర్మ, గోపాల కృష్ణయ్య, నరసింహ, కోయ పుల్లయ్య నాయుడు, వేణు గోపాల్ రెడ్డి, శారదమ్మ, సీతమ్మ, పార్వతి, భాగ్యమ్మ, ఉమ, అక్షరమ్మతోపాటు పెద్ద సంఖ్యలో మాతృమూర్తులు పాల్గొన్నారు.