జగన్ ఐదేండ్లు రైతుల నడ్డి విరిచి, నేడు వారిని అడ్డుపెట్టుకొని ధర్నాలు చేయడమా !
1 min readనంద్యాల నాగేంద్ర సూటి ప్రశ్న.
పల్లెవెలుగు వెబ్ నంద్యాల : వై.యస్ జగన్మోహన్రెడ్డి గడిచిన 5 సంవత్సరాల కాలంలో రైతుల నడ్డివిరిచి, వారిని అన్ని విధాలుగా అణిచివేసి, ఎంతో మంది రైతులు ఆత్మహత్యలకు కారకులైన మీరు నేడు రాష్ట్రంలోని రైతులకు గిట్టుబాట ధరలు కల్పించాలంటూ ధర్నాలు చేయడం నీ ద్వంద రాజకీయాలకు నిదర్శనమని, తెలుగుదేశంపార్టీ రాష్ట్ర కార్యదర్శి కె. నంద్యాల నాగేంద్రకుమార్ జగన్ ధర్నాలకు పిలుపునివ్వడం సిగ్గుచేటని అన్నారు. ఈ రోజు పత్రికల వారితో మాట్లాడుతూ వై.సి.పి. అధికారంలో ఉండగా రైతాంగానికి సకాలంలో పంటరుణాలు అందజేయలేదు. అలాగే విత్తనాలు, ఎరువులు అందించడంలో పూర్తిగా విఫలమైన జగన్మోహన్రెడ్డి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరను కల్పించలేదు. పంటలను కొనుగోలు చేసి వారికి చెల్లించాల్సిన పంటకొనుగోలు బకాయిలను చెల్లించకుండా రైతులను నానా ఇబ్బందులకు గురిచేయడం జరిగిందనీ, వారు రైతులకు చెల్లించాల్సినటువంటి పంటబకాయిలను కూటమి ప్రభుత్వం ఏర్పడితర్వాత చెల్లించిన విషయాన్ని ఈ సందర్భంగా మోసకారి రైతు వ్యతిరేకి జగన్కు గుర్తుచేసున్నా. రైతులు వ్యవసాయ అవసరాలకు ఉ పయోగించి విద్యుత్ మోటార్లకు మీటర్లను ఏర్పాటు చేయించి వారి నడ్డివిరిచిన సంగతి మరిచారా! నీవు చేస్తున్న రైతుల పట్ల కపట ప్రేమను ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా మరిచిపోలేదనీ అన్నారు. నీవు. కనీసం రైతాంగానికి నాణ్యమైన విత్తనాలను ఇవ్వడంలో కూడా విఫలమయ్యావు. రైతులు పంట దిగుబడిరాకా ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని, రైతులకు 13 వేల రూపాయల సహాయాన్ని అందిస్తానన్న నీవు కేవలం 6 వేల రూపాయలు మాత్రమే ఇచ్చి రైతులకు కంటితుడుపు సహయాన్ని చేశావు. అయితే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటిని ఒక్కొక్కటిగా అమలు పర్చుచున్నదనీ, త్వరలో రైతాంగానికి అంధించే రూ. 20 వేలను కూడా రైతుల ఖాతాల్లో జమచేస్తుందనీ, మీలాగా మాట ఇచ్చి తప్పడం చంద్రబాబునాయుడుకి రాదనీ, ఇప్పటికే ఇచ్చిన హామీలను కొన్నింటిని అమలులోకి తీసుకొని వచ్చారన్న అంశాన్ని గుర్తుంచుకొని ప్రజలు కూటమి ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తున్నారనీ, రాష్ట్రాన్ని గడిచిన 5 సంవత్సరాల కాలంలో మీరు కొనసాగించిన అవినీతి కూపం నుండి రాష్ట్రాన్ని బయటకు తీసుకొని రావడానికి ఆరుమాసాలు పట్టిందనీ. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి ప్రజలకు కోట్లాది రూపాయల భారం మోపిన నీకు రాష్ట్ర ప్రజలను గురించి మాట్లాడే అర్పతలేదనీ ఈ సందర్బంగా తెలియజేస్తున్నా. నీవు చేపట్టిన ఈ రోజు దర్నా కార్యక్రమానికి రైతులు లేక పూర్తిగా విఫలమయ్యాయనీ, ఇకముందు ఇలాంటిని అడ్డంపెట్టుకొని రాజకీయాలు చేయాలనుకోకుండాప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి, మౌనంగా ఉంటే నీకే మంచిదనీ సూచిస్తున్నా.. easide be (కె నంద్యాల నాగే, ద్రకుమార్ )
43/238-83, సుజాత నిలయం, ఎన్.ఆర్.పేట, కర్నూడు. ద్యేత్ ఫార్టీ6429 6867 క. రిఇ-మెయిల్: [email protected] రాష్ట్ర ఆర్యవైశ్య కార్పోరేషన్ డైరెక్టర్, ఆం.ప్ర.