జగన్ రెడ్డి అంటేనే ఒక అబద్దాల కోరు
1 min readఅరాచక పాలన అంతం మా కూటమి పంతం..
జగన్ ఛార్జ్ షీట్ విడుదల చేసిన కూటమి నేతలు.
జగన్ ఐదేళ్ల పాలన అవినీతి, అక్రమాలపై ఎన్డీయే కూటమి నేతలు ఛార్జ్ షీట్ విడుదల.
జగన్ ఐదేళ్ల పాలన అవినీతి, అక్రమాలపై కూటమి నేతల మీడియా సమావేశం.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: జగన్ రెడ్డి తన అధికారాన్ని కొనసాగించాలని, మరోసారి రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టాలని రాష్ట్ర ప్రజలను భ్రమలోకి తీసుకోవాలని. ఒక్కఛాన్స్ అంటూ అబద్దాలు చెప్పి, అస్యతాలు, అసాధ్యపు వాగ్దానాలతో ఎలా అధికారంలో వచ్చాడో మరలా రేపు మరో అబద్దపు మేని ఫెస్టోను విడుదల చేయడానికి జగన్ రెడ్డి సిద్దం అయ్యాడు. ఎన్ని మాయ మాటలు చెప్పినా ఎన్ని అబద్దాలు చెప్పినా జనం జగన్ రెడ్డి ప్రభుత్వానికి చరమగీతం పాడటానికి సిద్ధంగా ఉన్నారని నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇంచార్జి మాండ్ర శివానంద రెడ్డి అన్నారు. నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో మాండ్ర స్వగృహంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. నందికొట్కూరు నియోజకవర్గ టీడీపీ ఎన్నికల పరిశీలకులు శ్రీకాంత్ రెడ్డి , టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయసూర్య , జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త రవికుమార్ లతో కలిసి జగనాసురా రక్త చరిత్ర ,జగన్ రెడ్డి ఐదేళ్ల పాలన పై ఛార్జి షీట్ విడుదల చేశారు. ఈ మాండ్ర శివానంద రెడ్డి మాట్లాడుతూ వైసీపీ మేనిఫెస్టో అంతా బూటకమన్నారు. జగన్ రెడ్డి అంటేనే ఒక అబద్దాల కోరు.జగన్ రెడ్డి ముందు పుట్టి తరువాత అబ్ధం పుట్టింది. అబద్దం చెప్పడంలో అంతటి ఘనుడు జగన్ రెడ్డి. మద్యపాన నిషేదం చేసిన తరువాతే ఓటు అడుగుతానన్న జగన్ మద్యపాన నిషేదం చేశారా అని ప్రశ్నించారు . మీరు అమ్మిన చవకబారు మద్యానికి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు.
అరాచక పాలన అంతం మా కూటమి పతంతం.
ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయసూర్య..
జగనాసుర రక్త చరిత్ర పాలన ఇక ఒక్క రోజు కూడా ఉండటానికి లేదు. స్టేట్ టెర్రరిజాన్ని ప్రోత్సహించిన ఘనాపాటి జగన్ రెడ్డి. జగన్ రెడ్డిపాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. రాజ్యాంగం ఎగతాలి చేయబడింది. అందుకే జగన్ రెడ్డి మేనిఫెస్టో కంటే ముందే కూటమి ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తున్నాం. అబద్దాల కోరు ముఖ్యమంత్రి రేపు మళ్లీ అబద్దాల మేనిఫెస్టోతో ముందుకు వస్తున్నాడు.98శాతం మేని ఫెస్టో అమలు చేసి మీ ముందుకు వస్తున్నానని జగన్ రెడ్డి అబద్దాల పర్వానికి తెరతీశాడు. గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ ఇస్తే ఎంతో అద్భతం సృష్టిస్తానని చెప్పిన దానికే నేడు ప్రజలు అనుభవిస్తున్నారు. మళ్లీ ఇంకోసారి ఆ అబద్దాల ట్రాప్ లో ఏపీ ప్రజలు పడకూడదనే నేడు కూటమి ప్రజలు ఛార్జ్ షీట్ ను విడుదల చేశారు. సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా కూటమిగా మీ ముందుకు వచ్చాం. రాష్ట్రాన్ని నిలబెట్టుకోవడానికి, ప్రజలను గెలిపించుకోవడానికి, మన బిడ్డల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అలాగే గత ఐదేళ్లలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. సామాన్యుడు కడుపు నిండా తిండి తినే పరిస్థితి లేదు. ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి. పన్నులు పెరిగాయి. చెత్త మీద కూడా పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఉన్నాయా? జగన్ జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా? రాష్ట్రంలో యువతకు జాబు రావాలి అంటే కచ్చితంగా కూటమి ప్రభుత్వం రావాల్సిందేనని స్పష్టం చేశారు.
జగన్ పాలనలో స్వేచ్ఛ పూర్తిగా నశించింది:
జనసేన సమన్వయకర్త. రవికుమార్.
జగన్ పాలనలో స్వేచ్ఛ పూర్తిగా నశించింది. సమానవత్వం దహించింది. రాజ్యంగ ఉల్లంఘన, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిన ప్రభుత్వం జగన్ రెడ్డిది. 130 సార్లు బటన్ నొక్కాను 2లక్షల 75 కోట్లు మీ ఖాతాలో వేశానని చెప్పి సుమారు 13 లక్షల కోట్లు అప్పు చేసి ఒక్క వ్యక్తిపై 3 లక్షల అప్పు భారం మోపాడు. ల్యాండ్, శ్యాండ్, మైన్ అంతా దోపిడీకి గురైంది. గత ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని తీసుకు వస్తే ఇసుకలోనూ కూడా అవినీతి పాల్పడిన ఘనత జగన్ రెడ్డి ప్రభుత్వానిదే అని విమర్శించారు.
జగన్ రెడ్డి పాలన సిండికేట్ పాలన .
టీడీపీ పరిశీలకులు. శ్రీకాంత్ రెడ్డి.
గత ఐదు సంవత్సరాల జగన్ రెడ్డి ప్రభుత్వం అవినీతి అసమర్థత, దుర్మార్గానికి ప్రతిబింభంగా నడిచింది. జగన్ రెడ్డి పాలనలో ఒక సిండికేట్ పాలననడిచింది. సిండికేట్ రాజ్యంగా మార్చి లక్షల కోట్ల దోపిడీకి జగన్ రెడ్డి పాల్పడ్డారు, ఇసుకు, మట్టి, గంజాయి, రేషన్ బియ్యం తో అనేక రకాలుగా దోచుకున్నారు. జగన్ అవినీతికి అంతులేదు.పేదలు దళితులపై దాడులకు హద్దు లేదు. కేంద్రం ఎన్నో రకాలుగా సహకరించినా… రాష్ట్రంలో లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది. రాష్ట్రం అభివృద్ధి ఎక్కడ లేదు. పేదలక కనీస మౌలిక వసతులు కల్పించలేదు. పేదల సమగ్రాభివృద్ధికి పాటుబడలేదు. అందుకే జగన్ రెడ్డి అరాచకాలపై ఛార్జ్ షీట్ తెచ్చాం… దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం… ప్రజలు దాన్ని గమనించి వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలి. రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్ కు అడ్డాగా మర్చారు. ల్యాండ్, శ్యాండ్, వైన్ మాఫియాకు కేరాఫ్ గా మార్చారు. విచ్చల విడిగా రాష్ట్రాన్ని దోచుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జరిగిన అన్యాయాలను రాష్ట్రంలో గుర్తు పెట్టుకోవాలి. సబ్ ప్లాన్ నిధులు లక్ష కోట్లను ముఖ్యమంత్రి దారి మళ్లించారు. నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పి నమ్మబలుకుతున్నారు. అందరూ కలిసి జగన్ చెంప ఛెళ్లుమనిపించి ఇంటికి పంపుతారన్నారు. కార్యక్రమంలో టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.