వైఎస్ఆర్సిపి కర్నూలు జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో జగనన్న జన్మదిన వేడుకలు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రజా నేత ఎస్ వి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో అంబరాన్ని అంటిన జననేత జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకులు ఎస్ వి కాంప్లెక్స్ ఆవరణలో జరిగిన కార్యక్రమం నకు ఎస్ వి మోహన్ రెడ్డి తో పాటు నగర మేయర్ శ్రీ బి వై రామయ్య కోడుమూరు ఇంచార్జ్ సతీష్ , డిస్టిక్ కోపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ మాజీ చైర్మన్ శ్రీమతి ఎస్ వి విజయ మనోహరి ల సమక్షంలో భారీ సంఖ్యలో హాజరు అయిన నాయకులు, మహిళా నాయకుల కార్యకర్తలు మరియు పార్టీ అనుబంధ విభాగ ము ల నాయకుల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ ఎస్ వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచిన జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అంటే ప్రతి ఒక్కరికి ఆనందమని కష్టాలు ఎదుర్కోవడం జగనన్నకు కొత్త కాదని త్వరలోనే జగనన్న ప్రజాక్షేత్రంలోకి వస్తారని విజయానికి అతి చేరువలో ఉన్నామని ప్రతి కార్యకర్త కష్టపడాలని పిలుపునిచ్చారు.