PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఖైదీల్లో సత్ప్రవర్తన పెంపొందించే విధంగా జైల్ అధికారులు కృషి చేయాలి

1 min read

జైల్ నిబంధనలకు అనుగుణంగా ఖైదీలకు అన్ని సౌకర్యాలు కలిపించాలి.. కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  జైలు జీవితం గడుపుతున్న వారిలో మానసిక ఆందోళనను దూరం చేస్తూ, వారిలో సత్ప్రవర్తనను పెంపొందించేందుకు వీలుగా జైల్ అధికారులు కృషి చేయాలని కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు కోరారు..ఎం.పి హోదాలో మొదటి సారి జిల్లా జైలును సందర్శించిన ఆయన.. వివిధ కేసుల్లో శిక్ష పడిన ఖైదీలను కలిసి జైలులో వారికి అందిస్తున్న భోజనం, ఇతర సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు.. అలాగే ఏ కేసుల్లో జైలుకు వచ్చారని ఆరా తీశారు..ఈ సందర్భంగా ఎం.పి నాగరాజు మాట్లాడుతూ జైలు నిబంధనలకు అనుగుణంగా ఖైదీలకు అన్ని వసతి, సౌకర్యాలు కలిపించాలని అధికారులకు సూచించారు.. ఖైదీ ల్లో మార్పు వచ్చేందుకు  జైలు వాతావరణం దోహదపడేలా చూడాలన్న ఆయన..ఇక చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని, తప్పు చేసాం అనే పశ్చాత్తాపం ప్రతి ఒక్కరిలో కలగాలన్నారు..ఈ కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ నరసింహారెడ్డి, జైలర్ ఎరికి నాయుడు, డిప్యూటీ జైలర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

About Author