PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మే6 నుండి జీ తెలుగులో జానకి రామయ్యగారి మనవరాలు

1 min read

పల్లెవెలుగు వెబ్ అనంతపూర్​:  ప్రేమ, బాధ్యతల నడుమ సాగే సరికొత్త ప్రేమ కథతో రూపొందుతున్న సీరియల్ జానకి రామయ్యగారి మనవరాలు, అనురాగం, ఆప్యాయతల నడుమ పెరిగి తన అభిరుచికి తగిన అమ్మాయి కోసం వెతికే అబ్బాయి, కుటుంబ బాధ్యతల్లో తలమునకలైన అమ్మాయి మధ్య సాగే అందమైన ప్రేమకథగా ఈ సీరియల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆకట్టుకునే కథతో రానున్న జానకి రామయ్యగారి మనవరాలు, మే 6న ప్రారంభం, సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు, మీ జీ తెలుగులోజానకి రామయ్యగారి మనవరాలు సీరియల్ కథ తరతరాల నుంచి వస్తున్న మిఠాయి వ్యాపారం చేస్తున్న ఉత్తమ్ (రాజీవ్) చుట్టూ తిరుగుతుంది. తీవ్రమైన కుటుంబ కలహాలు, బాధాకరమైన గతం కారణంగా ఉత్తమ్ నానమ్మ (పాతిమా బాబు), తల్లి, మేనత్త, అత్త తమ ఆశలన్నీ, కలలన్ని ఉత్తమైపై రుద్దుతారు. ఎంతో అప్యాయంగా పెంచిన ఆ నలుగురు మహిళలను తన తల్లులుగానే భావిస్తాడు ఉత్తమ్ అందరూ కలిసి ఉత్తమ్ ను మంచి వ్యక్తిగా, నిజాయతీపరుడిగా పెంచుతారు. ఉత్తమ్ గుణవంతుడైన యువకుడిగా, ఏ అమ్మాయికైనా సరిపోయే ఆదర్శ కొడుకుగా ఎదుగుతాడు.. ఉత్తమ్ కి సరిపోయే అమ్మాయిని వెతకడం ప్రారంభిస్తారు అతని కుటుంబ సభ్యులు.అందులో ఎదురయ్యే మలుపులు తెలియాలంటే తెలుగులో మే 5న ప్రారంభం కానున్న జానకి రామయ్యగారి మనవరాలు సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!కుటుంబం, ప్రేమ మధ్య సాగే ఆసక్తికర కథాంశంతో సాగే జానకి రామయ్యగారి మనవరాలు జీ తెలుగు వీక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ సీరియల్లో రాజీవ్, సంగీత ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, ఫాతిమా బాబు, రాజశేఖర్, అర్చన, జాకీ, కల్యాణ్ ప్రసాద్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ప్రతిభావంతులైన నటీనటులు, అద్భుతమైన కథాంశం, ఆసక్తికరమైన మలుపులతో సాగే జానకి రామయ్యగారి మనవరాలు సీరియల్ మీరూ తప్పక చూడండి!భావోద్వేగాల సమాహారంగా సాగే సరికొత్త సీరియల్ జానకి రామయ్యగారి మనవరాలు.. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 2:30గం మీ జి తెలుగులో మే 6 న ప్రారంభం.. తప్పక చూడండి!

About Author