సురేష్ బాబుకు శుభాకాంక్షలు తెలిపిన జనసేన..
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన పార్టీ ఇన్చార్జి చింతా సురేష్ బాబును జనసేన పార్టీ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం నూతన సంవత్సరం సందర్భంగా కర్నూలులోని జనసేన పార్టీ కార్యాలయంలో సురేష్ బాబును మిడుతూరు మండల జనసేన పార్టీ నాయకులు గుడిపాడు ప్రభాకర్ మరియు తోలు మంజునాథ్,మౌలాలి,నవీన్ రెడ్డి,సయ్యద్ తదితరులు కలిసి పూలబోకేలతో శుభాకాంక్షలు తెలిపారు.కేక్ కట్ చేసి ఒకరినొకరు సంతోషంగా పంచుకున్నారు. తర్వాత ఆయనను శాలువాలు పూలమాలలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ చేరే విధంగా చూడాలని జనసేన పార్టీ కార్యకర్తలకు ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ ఇన్చార్జి సురేష్ బాబు వారికి సూచించారు.