జనసంద్రం మధ్య జననేత జగనన్న పుట్టినరోజు వేడుకలు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి బుట్టా రేణుక ఆధ్వర్యంలోవై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని పలు సేవ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని బుట్టా శివ నీలకంఠ, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి, అనుబంధ విభాగాల రాష్ట్ర వీర శైవ లింగాయత్ అధ్యక్షులు రుద్ర గౌడ్ లు, మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు పండుగల కనిపిస్తుందని, జగన్మోహన్ రెడ్డి ఎల్లవేళలా బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలని ఎన్నో పథకాలు అమలు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది అని అన్నారు. పుట్టినరోజు సందర్భంగా.వైయస్ విగ్రహానికి పూలమాల వేసి భారీ జనసంద్రం మధ్య కేక్ కట్ చేశారు. బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్స్ పంపిణీ చేసి బుట్ట ఫౌండేషన్ తరపున ప్రభుత్వ ఆసుపత్రికి 200 కుర్చీలు మరియు బెడ్ షీట్లు, పంపిణీ చేయడం జరిగింది. ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలు సహకరిస్తే మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని బుట్ట శివ నీలకంఠ అన్నారు.ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, ఇన్చార్జులు, కో ఆప్షన్ నెంబర్లు, మండల నాయకులు, ఆయా గ్రామ నాయకులు, జెడ్పిటిసిలు, ఎంపీపీలు, ఎంపిటిసిలు, సర్పంచులు,ఉప సర్పంచ్ లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.