ఒక రోజు ముందే జనవరి నెల పెన్షన్లు…
1 min readడిసెంబర్ 31న జిల్లాలో సామాజిక పెన్షన్ల పంపిణీ.
జిల్లాలో 2,62,228 మంది ఫించన్ దారులకు రూ. 113.01 కోట్లు పంపిణీకి ఏర్పాట్లు
పెన్షన్ పంపిణీ పై అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసాపించను జనవరి నెల పింఛను చెల్లింపులు జనవరి 1 వ తేది నూతన ఆంగ్ల సంవత్సరం తొలిరోజు కావడం వలన రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు డిసెంబర్ 31 వ తేదీ మంగళవారం ఉదయం 6.00 గంటల నుంచి పెన్షన్ పంపిణీ ప్రారంభమవునని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు.డిసెంబర్ 31 వ తేదీన ఫించన్లు ఏదైనా కారణం చేత తీసుకోని వారికి 02.01.2025 తేదీన పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. మంగళవారం జనవరి నెల పెన్షన్ల పంపిణీ పై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో జనవరి నెలలో 2,62,228 మంది ఫించన్ దారులకు 113.01 కోట్ల రూపాయిలు పంపిణీ చేయవలసి ఉండగా 31.12.2024 వ తేది న 100 శాతం ఫించన్లు పంపిణీ చేయాలని దానికి అనుగునంగా అధికారులు అందరూ చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో జనవరి నెల ఫించన్లు ఒక రోజు ముందుగా 31.12.2024 న ఇస్తున్న విషయాన్ని ప్రతి ఫించన్ దారునికి వ్యక్తిగతంగా తెలియచేయాలని, అలాగే ఫించన్ పంపిణీకి నిర్దేశించిన 5,298 మంది సిబ్బంది తప్పకుండా ఆరోజు ఉదయం 6 గంటలకు పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలన్నారు. ఫించన్ పంపిణీ దారులకు మొదటి 4 గంటలలోపు పంపిణీ పూర్తిచేసేలా ఏర్పాట్లు చేసుకోవాలని , ఎక్కడైనా ఏ ఒక్క పొరపాటు జరగకుండా ఫించన్లు పంపిణీ జరగాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అలాగే ఈ నెలలో గత రెండు నెలలలో వివిధ కారణం లతో ఫించన్ తీసుకొని వారికి ఈ నెల 3 నెలలు మొత్తం పంపిణీ చేయబడునన్నారు.అలాగే నవంబర్ 2024 నెలలో జీవిత భాగస్వామి మరణించిన వారికి 212 మందికి ఈ నెలలో కొత్తగా ఫించన్ మంజూరు చేయడం జరిగిందన్నారు. కావున ఈ సమాచారం అందరికి తెలియచేయాలని మండల పరిషత్ అభివృద్ది అధికారులకు, మునిసిపల్ కమిషనర్ లకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఆర్.విజయరాజు జిల్లా పరిషత్ సి.ఇ.ఓ,కె. సుబ్బారావు జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ డి.నీలాద్రి పాల్గొన్నారు.