PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జట్కా కాలనీ కబ్జాదారుల నుండి కాపాడాలి… సిపిఐ

1 min read

జట్కా కాలనీలో ఖాళీగా ఉన్న స్థలాల్లో అర్హులైన నిరుపేదలకు ఇంటి స్థలం ఇవ్వాలి….డి.రాజా సాహెబ్

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ పట్టణంలో  బైపాస్ లో ఉన్న సర్వే నెంబర్ 308/3 ప్రభుత్వ భూమి లో  జట్కా కాలనీ ఉన్న స్థలాలు కబ్జా నుండి కాపాడి అర్హులైన నిరుపేదలకు ఇంటి స్థలం ఇచ్చి పక్క గృహ నిర్మాణం పథకాన్ని అమలు చేయాలని  బుధవారం  పత్తికొండ తహశీల్దార్ రమేష్ కు  సిపిఐ మండల కార్యదర్శి డి రాజా సాహెబ్  చేతి వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి ఎం కారన్న కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే తిమ్మయ్య సిపిఐ జిల్లా సమితి సభ్యులు కే పెద్ద ఈరన్న సిపిఐ పట్టణ కార్యదర్శి రామాంజనేయులు తో కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం డి రాజా సాహెబ్ మాట్లాడుతూ, పత్తికొండ పట్టణంలోని బైపాస్ రోడ్డులో జట్కా కాలనీ సర్వేనెంబర్:-308/3. గత 25 సంవత్సరాల క్రితం పత్తికొండ పట్టణంలో జట్కాలు తోలుకుంటూ జీవనం సాగిస్తున్న కుటుంబాలను గుర్తించి అప్పటి అధికారులు 308/3 లో ఇంటి స్థలాలను కేటాయించారు. కానీ ఆర్థిక స్తోమత లేక  ఆ  స్థలాల్లో ఇంటి నిర్మాణం చేసుకోలేకపోయారని ఆవేదన చెందారు. అయితే ఆ స్థలం పక్కన ఉన్న పొలం యజమానులు మరియు బయట వ్యక్తులు జట్కా కాలనీలో ఉన్న స్థలాలను ఆక్రమణ చేసుకోవాలని గత వారం రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. పత్తికొండ పట్టణంలో వందలాది మంది అర్హులైన నిరుపేదలు ఇంటి స్థలం లేక పక్కా గృహాలు లేక ఇంటి అద్దెలు చెల్లించలేక ఆర్థిక  ఇబ్బందులతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, వారికి ఇంటి స్థలం  కేటాయించి పక్కా గృహ నిర్మాణ పథకం అమలు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో గత రెండు నెలల నుండి అర్హులైన నిరుపేదలతో వ్యక్తిగత అర్జీలతో మీ కార్యాలయం ముందు నిరసన తెలియజేసి అర్జీలు కూడా ఇచ్చామని గుర్తు చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *