PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భారత ప్రజాస్వామ్య సౌధానికి నిర్మాత జవహర్ లాల్ నెహ్రూ

1 min read

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుకే బాబురావు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:    భారత ప్రజాస్వామ్య సౌదానికి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ  నిర్మాత అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కే బాబురావు  అభిప్రాయపడ్డారు. సోమవారం పండిట్ జవహర్లాల్ నెహ్రూ  60వ వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటమునకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యకర్తల సమావేశంలో బాబురావు  మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే పండిట్ జవహర్‌లాల్ నెహ్రూని భారత  ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ  దేశానికి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. నెహ్రూ మంచి పరిపాలనా దక్షుడని ఆగర్భ శ్రీమంతుడయినా నిరాడంబరుడని స్వాతంత్ర్య  ఉద్యమంలో జైలు జీవితం గడిపాడని నెహ్రూ  మంచి రచయితగా, పండితుడుగా, చరిత్రకారుడిగా భారతదేశ రాజకీయాల్లో శక్తివంతమైన నాయకుడిగా ఎదిగారని దేశానికి మొదటి ప్రధాని అయ్యాక దేశాన్ని అనేక సంక్షోభాల నుండి గట్టెక్కించాడని  నెహ్రూ  భారత ప్రజాస్వామ్య సౌధానికి నిర్మాత అయ్యాడని ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు, ప్రభుత్వ రంగ సంస్థలయిన రైల్వేలు, విశ్వ విద్యాలయాలు, కర్మాగారాలు వైద్య శాలలు, బీమా సంస్థలు బ్యాంకులు మొదలగునవి స్థాపించాడని నేడు ప్రధాని మోడీ ప్రభుత్వరంగ సంస్థలను అంబానీ ఆదానీలకు ప్రైవేట్ పరం చేయడం విడ్డూరంగా ఉందని ప్రజాస్వామిక విధానం ఐదేళ్ల ఎన్నికల విధానం వల్లనే మోడీ లాంటి సాధారణ వ్యక్తులు నేడు ప్రధాని కాగలిగారని బాబురావు  అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో నియంతల మెడలు వంచేది ఎన్నికల విధానమేనని ఈ ఎన్నికల విధానం లేకపోతే భారతదేశం కూడా మరో మయన్మార్ లా తయారై ఉండేదని సమసమాజ స్థాపనే పరిపాలన లక్ష్యం కావాలని నెహ్రూ ఆకాంక్షించారని ఆయన చేసిన సేవలను బాబురావు  కొనియాడారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు, కర్నూలు అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి షేక్ జిలాని భాష, డిసిసి గౌరవాధ్యక్షులు కే వెంకటన్న, స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ పీజీ నరసింహులు యాదవ్, డిసిసి కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ అనంతరత్నం మాదిగ, డిసిసి ప్రధాన కార్యదర్శి కె సత్యనారాయణ గుప్త, కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ ఈ లాజరస్, కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు కోసిగి జిలాని, రాష్ట్ర ఓబిసి సెల్ ప్రధాన కార్యదర్శి సి వెంకట రాముడు, సీనియర్ డాక్టర్ డాక్టర్ సుభాన్, సిటీ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ ఖాజా హుస్సేన్, ఎన్ సి బజారన్న, డిసిసి కార్యదర్శులు జి వెంకటస్వామి, బి సుబ్రహ్మణ్యం, అబ్దుల్ హై, వెల్దుర్తి శేషయ్య,  ఎం అశోక్ మహిళా కాంగ్రెస్ కె వెంకటలక్ష్మి మొదలగు వారు పాల్గొన్నారు.

About Author