భారత ప్రజాస్వామ్య సౌధానికి నిర్మాత జవహర్ లాల్ నెహ్రూ
1 min readజిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పి మురళీకృష్ణ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: భారత ప్రజాస్వామ్య సౌధానికి నిర్మాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ని కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే , తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి మాజీ సభ్యులు పి మురళీకృష్ణఅభిప్రాయ పడ్డారు. జవహర్ లాల్ నెహ్రూ 135 వ జయంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. మనకు స్వాతంత్య్రం వచ్చిన అనంతరం భారత తొలి ప్రధాన మంత్రిగా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఎన్నిక అయ్యారని, నెహ్రూ మంచి పరిపాలనా దక్షుడని ఆగర్భ శ్రీమంతుడయినా నిరాడంబరుడని, స్వాతంత్ర్య ఉద్యమంలో జైలు జీవితం గడిపాడని నెహ్రూ మంచి రచయితగా, పండితుడుగా, చరిత్రకారుడిగా భారతదేశ రాజకీయాల్లో శక్తివంతమైన నాయకుడిగా ఎదిగారని భారత దేశ మొదటి ప్రధాని అయ్యాక దేశాన్ని అనేక సంక్షోభాల నుండి గట్టెక్కించాడని నెహ్రూ భారత ప్రజాస్వామ్య సౌధానికి నిర్మాత అయ్యాడని ప్రజాస్వామిక విధానం ఐదేళ్ల ఎన్నికల విధానం వల్లనే సాధారణ వ్యక్తులు ప్రజా ప్రతినిధులు కాగలుగుతున్నారని ప్రజాస్వామ్యంలో నియంతల మెడలు వంచేది ఎన్నికల విధానమేనని ఈ ఎన్నికల విధానం లేకపోతే భారతదేశం కూడా మరో పాకిస్థాన్ లా, మయన్మార్ లా తయారై ఉండేదని సమసమాజ స్థాపనే పరిపాలన లక్ష్యం కావాలని నెహ్రూగారు ఆకాంక్షించారని, ఆయనకు చిన్న పిల్లలంటే అమితమైన ప్రేమ అని అందుకే ఆయన పుట్టినరోజును బాలల దినోత్సవంగా జరుపు కుంటున్నామని మురళీకృష్ణ ఆయన చేసిన సేవలను కొనియాడారు. ముందుగా పార్టీ కార్యాలయంలో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ చిత్రపటమునకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పి మురళీకృష్ణ అధ్యక్షతన కార్యకర్తల సమావేశం జరిగినది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర బాబు, పార్లమెంటు సమన్వయకర్త పీజీ రామ్ పుల్లయ్య యాదవ్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాష, కాంగ్రెస్ నాయకులు కే వెంకటరెడ్డి, ఎన్ సి బజారన్న, పోతుల శేఖర్, సత్యనారాయణ గుప్త, షేక్ ఖాజా హుస్సేన్, మహేంద్ర నాయుడు, రియాజుద్దీన్, ఈ లాజరస్ అనంతరత్నం మాదిగ, ఎస్ సారమ్మ, ఎస్ ప్రమీల ఏ వెంకట సుజాత, సాంబశివుడు, బి సుబ్రహ్మణ్యం డబ్ల్యూ సత్యరాజు జాన్ సదానందం, ఎజాస్ అహ్మద్, తిప్పన్న నాయుడు, పశుపల, ప్రతాపరెడ్డి, రమేష్, షేక్ మాలిక్ భాష, ఐ ఎన్ టి యు సి నాయకులు ఎన్ సుంకన్న, ఆర్ ప్రతాప్, కాంగ్రెస్ వసి బాషా, అక్బర్, రంగస్వామి, కేశవరెడ్డి రెడ్డి, లోక రామయ్య మహిళా కాంగ్రెస్ కరుణమ్మ, పుష్పలీల మొదలగు వారు పాల్గొన్నారు.