జయప్రదంగా మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ పత్తికొండ నియోజకవర్గం లోని అన్ని పాఠశాలలనూ, జయప్రదంగా నిర్వహించారు. పత్తికొండ పత్తికొండ పట్టణంలోనే స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పాఠశాల హెడ్మాస్టర్ భ్రమరాంబ ఆధ్వర్యంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అంగరంగ వైభవంగా జరిగింది .పిల్లలు తమ తరగతి గదులను పాఠశాల ఆవరణమును ఆవరణమును ఆకర్షణీయంగా అలంకరించారు. పిల్లలు తయారుచేసిన గ్రీటింగులతో తల్లిదండ్రులను ఆహ్వానించారు. తల్లిదండ్రుల సమావేశంలో పాఠశాల చైర్మన్ రామాంజనేయులు, వైస్ చైర్మన్ మైమూన్ , తల్లిదండ్రులు ఎర్రగుడి గోపాల్ మరియు సేక్షావలి పాఠశాల పూర్వ విద్యార్థిని మరియు రిటైర్డు ఉపాధ్యాయురాలు వరలక్ష్మి పాల్గొని సూచనలు సలహాలు ఇచ్చారు. హాజరైన తల్లులకు ముగ్గుల పోటీలు నిర్వహించి,తండ్రులకు తాడు లాగే పందెం పెట్టి నెగ్గిన వారికి బహుమతులను పంపిణీ చేశారు. పిల్లలు అనేక సాంస్కృతి కార్యక్రమాలను ప్రదర్శించారు. ఎనిమిదవ తరగతి విద్యార్థిని చందు శ్రీ అద్భుతమైన నృత్య ప్రదర్శన మరియు ఏక పాత్రాభినయం,తెలుగు టీచర్ చాముండేశ్వరి మత సమైక్యతను పెంపొందించే నాటిక సూపరులను ఆకట్టుకున్నది.కార్యక్రమం అనంతరం తల్లి తండ్రులు,టీచర్లు సహపంక్తి భోజనాలు చేశారు.