శ్రీ సరస్వతీ శిశు మందిరంలో ఝాన్సీ లక్ష్మీభాయి జన్మదిన వేడుకలు
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: ప్యాపిలి శిశు మందిర్ లో ఝాన్సీ లక్ష్మి భాయి జన్మదినం వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా మంగళవారం ఆచార్యులు వాసు మాట్లాడుతూ ఝాన్సీ లక్ష్మి బాయ్ 1828నవంబర్ 19న జన్మించారని చెప్పారు. వీరి తల్లిదండ్రులు మొరోపంత్ తాంబే, భాగీరధీ బాయ్ లు.ఆమె అసలు పేరు మణికర్ణిక. ఆమెకు 13 ఏళ్ళ వయసులోనే 1842లో ఝాన్సీ పట్టణానికి రాజైన గంగాధరరావు నెవాల్కర్ తో వివాహమైంది. 1857లో మీరట్ లో భారత సిపాయిల తిరుగుబాటు మొదలయింది. బ్రిటిష్ కి వ్యతిరేకంగా ఇది మొదటి తిరుగుబాటుగా నిలుచింది. ఇందులో లక్ష్మీ భాయ్ పాల్గొంది.దామోదర రావు రాజాకు రక్త సంబంధం కానందువలన అంటే దత్త సంబంధం కావున, ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ జనరల్ లార్డ్ డల్ హౌసి అప్పటి రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం రావు సింహాసనాన్ని అధిష్టించే అధికారం లేదని అతనిని నిరకరించారు. ఈకార్యక్రమంలో ఆచార్యులు, బాల బాలికలు పాల్గొన్నారు.