విప్లవ వేగుచుక్క కా, చేగువేరాకి జోహార్..
1 min readపిడిఎస్ యు..ఆర్పిఎస్ఎఫ్
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:విప్లవ వీరుడు చేగువేరా57 వ వర్ధంతి సందర్బంగా కా,చేగువేరా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా విద్యార్ధి సంఘాల నాయకులునవీన్,శేఖర్ నాయుడు మాట్లాడుతూకా,చేగువేరా 1928 జన్మించి 1967 న మరణించారని ఈయన ఒక అర్జెంటినా మార్క్సిస్ట్ విప్లవకారుడు,వైద్యుడు, రచయిత,మేధావి,గెరిల్లా నాయకుడు,సైనిక సిద్ధాంతకుడు,క్యూబన్ విప్లవములో ప్రముఖవ్యక్తి. ఆయన మరణించిన తర్వాత అతడి విలక్షణ శైలి కలిగిన ముఖాకృతి ప్రపంచవ్యాప్తంగా విప్లవ భావాల సంస్కృతికి ప్రపంచ చిహ్నంగా మారింది.యుక్తవయసులో మెడికల్ విద్యార్థిగా ఉన్న చేగువేరా లాటిన్ అమెరికా అంతా పర్యటించారు.ఈ పర్యటనల్లో అతని పరిశీలనలతో దేశంలో దృఢంగా ఉన్న ఆర్థిక తారతమ్యాలు,ఏకస్వామ్య పెట్టుబడిదారీ వ్యవస్థ,నూతన వలసవాదం,సామ్రాజ్యవాద ఫలితమేనని తుదినిర్ణయానికి వచ్చారు.దీనికి ఒకేఒక్క పరిష్కారం ప్రపంచ తిరుగుబాటు అని భావించారు.క్యూబా తిరుగుబాటు తర్వాత,చేగువేరా నూతన ప్రభుత్వంలో అనేక ప్రధానపాత్రలను పోషించారు. రెవల్యూషనరీ ట్రిబ్యునల్స్ లో యుద్ధ నేరస్థులుగా పరిగణింపబడిన వారియొక్క వినతులు,ఫైరింగ్ దళాలను సమీక్షించడం,పరిశ్రమల శాఖ మంత్రిగా వ్యవసాయ సంస్కరణలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.కార్మికులు కోసం ఎన్నో పోరాటాలు చేశారన్ని వారుఅన్నారు. అయన స్ఫూర్తితో యువకులు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో భవన కార్మికులు వివిధ కార్మికులుసలాం,రాజు, రామ్,వేంకటేష్,రమేష్ ఆచారి పాల్గొన్నారు.