క్రీడాకారులను అభినందించిన జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య
1 min read68వ జాతీయస్థాయి ఎస్ జి ఎఫ్ అండర్ 19 వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపిక అయిన వెయిట్ లిఫ్టర్స్ మరియు రాష్ట్రస్థాయి జూడో పోటీలొ పథకాలు సాధించిన క్రీడాకారులను అభినందించిన జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఢిల్లీలో జరిగే 68 వ జాతీయస్థాయి ఎస్ జి ఎఫ్ అండర్ 19 వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులను మరియు 68 రాష్ట్రస్థాయి Sgf u 19 జూడో పోటీలో పథకాలు సాధించిన క్రీడాకారులను జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య అభినందించారు. సోమవారం సునయన ఆడిటోరియంలో నవంబర్ 16 నుంచి 18 వరకు గుడివాడలో జరిగిన 68 వ రాష్ట్రస్థాయి ఎస్ జి ఎఫ్ అండర్ 19 వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో మరియు ఈనెల 23 నుంచి 24 రేణిగుంటలో జరిగే 68 రాష్ట్రస్థాయి SGF అండర్ 19 జూడో పోటీలలో పాల్గొని మెడల్స్ సాధించిన క్రీడాకారులను జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య అభినందించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ నవంబర్ 16 నుంచి 18 వరకు గుడివాడలో జరిగిన 68 వ రాష్ట్రస్థాయి ఎస్ జి ఎఫ్ అండర్ 19 వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో పాల్గొని పథకాలు సాధించిన ఎం పుష్పాంజలి 76 కేజీల విభాగంలో స్వర్ణ పథకం,బి నవీన్ +102 కేజీల విభాగంలో స్వర్ణ పథకం ,,ఎన్ లోహిత 87 కేజీల విభాగంలో కాంస్య పథకం, బి శేషు 102 కేజీల భాగంలో కాంస్య పతకాలను, అదేవిధంగా ఈనెల 23 నుంచి 24 రేణిగుంటలో జరిగే 68వ రాష్ట్రస్థాయి SGF అండర్ 19 జూడో పోటీలలోఆర్ ఇసాక్ 73 కేజీల భాగంలో వెండి పధకం,బి శేషు+90 కేజీల విభాగంలో కాశ్య పథకం లను సాధించిన క్రీడాకారులను అభినందించారు.. డిసెంబర్ నెల రెండో వారంలో ఢిల్లీ లో జరిగే 68 వ జాతీయస్థాయి SGF అండర్ 19 వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో పాల్గొననున్నారని ఈ పోటీలలో కూడా పథకాలను సాధించి మన జిల్లాకు మంచి పేరు తేవాలని క్రీడాకారులను జాయింట్ కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో డిఎస్డివో భూపతి డివిఈఓ పరమేశ్వర్ రెడ్డి, క్రీడల కోచ్ లు యూసుఫ్, చంద్రశేఖర్, మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.