PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా ఉమ్మడి జిల్లా హెచ్.పీ.సి.ఎల్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు

1 min read

హిందుస్థాన్ పెట్రోలియం కు 50 వసంతాలు

మీట్-2024 కి పెద్ద ఎత్తున పాల్గొన్న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా డీలర్స్

నాణ్యం,నైపుణ్యంమైన సేవలు అందించేందుకు సిద్ధం

రీజనల్ మేనేజర్ ఆదిత్య ఆనంద్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు నగరంలోని సెంట్రల్ ప్లాజా లోని ఏరేనా కాన్ఫరెన్స్ హాల్లో శనివారం హె హెచ్ పిసిఎల్  డీలర్స్ మీట్- 2024 ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా లో ఉన్న హిందుస్థాన పెట్రోలియం డీలర్స్ అందరూ ఫ్యామిలీతో హాజరయ్యారు. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ1974 లో ప్రారంభించబడి 2024 సంవత్సరానికి 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా విజయవాడ రిటైల్ రీజనల్ ఆఫీస్ ఆధ్వర్యంలో గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లాకు చెందిన విద్యార్థి ఆకుల నాగ వెంకట సాయి మనస్విని ఈ సంవత్సరం పదవ తరగతిలో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. 600 మార్కు లకు గాను 599 మార్కులు సాధించడంతోనే ఈ విద్యార్థినిని హిందుస్థాన్ పెట్రోలియం సంస్థ ఘనంగా సత్కరించారు. ముందు ముందు మరిన్ని విజయాలు సాధించాలని ఆశీర్వదించారు. ముందుగా సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నృత్య భారతి అకాడమీ నుంచి వచ్చిన విద్యార్థిని విద్యార్థులు తమ నృత్య ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నారు. ప్రతి విద్యార్థిని సంస్థ తరఫున అందరికీ జ్ఞాపికలు అందించారు. ఈ సందర్భంగా విజయవాడకు చెందిన రీజనల్ మేనేజర్ ఆదిత్య ఆనంద్ విలేకరులతో మాట్లాడుతూ హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తయిందని వినియోగదారులందరికీ నాణ్యమైన నైపుణ్యం కలిగిన సేవలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణాన్ని పరిరక్షించేందుకు 500 మెగావాట్లతో కూడిన సోలార్ ప్లాంట్ ను త్వరలో ఏర్పాటు చేసేందుకు కంపెనీ సిద్ధంగా ఉందన్నారు. అంతేకాకుండా వినియోగదారులు సౌకర్యార్థం పర్యావరణ పరిరక్షణకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని అన్నారు. రాష్ట్రంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో సోలార్ సిస్టం ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక తో ముందడుగు వేస్తున్నామని తెలిపారు. డీలర్స్ కి తమ బంకుల్లో తీసుకోవలసిన జాగ్రత్తలపై క్షుణ్ణంగా అవగాహన కల్పించారు. డీలర్స్ ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కార దిశగా సూచనలు సలహాలు అందించారు. ఈ సమావేశంలో ఇంజనీర్ అక్షయ్ చౌహాన్, చీఫ్ మేనేజర్ విల్సన్, ఏలూరు జిల్లా సేల్స్ ఆర్గనైజర్ మహేష్, సందీప్ శ్రీనివాస్.పలువురు ప్రముఖులు  ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా డీలర్స్ పాల్గొన్నారు. అనంతరం ఉమ్మడి జిల్లా డీలర్స్ కు ఫెర్ఫామ్నెస్  అవార్డ్స్ అందజేశారు.

About Author