పాఠశాలకు పాత్రికేయుడి ట్యూబ్ లైట్లు అందజేత..
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండల కేంద్రంలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలకు పాత్రికేయుడు ట్యూబ్ లైట్లను అందజేశారు. సోమవారం పాఠశాల ప్రిన్సిపాల్ పి.సత్య నారాయణ మూర్తికి నందికొట్కూరు పల్లెవెలుగు ఇన్చార్జి డి స్వాములు ట్యూబ్ లైట్లను అందజేశారు.పాఠశాల అభివృద్ధికి సహకరించడం హర్షించదగ్గ విషయమని అంతేకాకుండా పాఠశాల విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ప్రిన్సిపాల్ అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ దామోదర్ రెడ్డి, ఉపాధ్యాయులు కృష్ణుడు, హుస్సేన్ పాల్గొన్నారు.