PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా రెవెన్యూ డే వేడుకలు

1 min read

ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో రెవెన్యూ శాఖ ముఖ్య భూమిక పోషిస్తుంది

ఏలూరు ఆర్డీవో ఖాజావలి

ఉద్యోగులు రెవెన్యూ చట్టాల పై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, ఏలూరు జిల్లా ఏలూరు రెవెన్యూ భవనంలో ఘనంగా రెవెన్యూ దినోత్సవ వేడుకలు.సర్వీసులో పౌరులకు విశిష్ట సేవలందించిన విశ్రాంత తహశీల్దార్లు మరియు రెవెన్యూ ఉద్యోగులను సత్కరించిన ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ , ఏలూరు జిల్లా నాయకులు. జూన్ 20 వ తేదీ 1786 వ సంవత్సరంలో మొట్టమొదటగా బోర్డు ఆఫ్ రెవెన్యూ అనేది భారత దేశంలో ఏర్పడిన తేదీని(జూన్ 20) రెవెన్యూ డే గా ప్రతీ సంవత్సరం జరుపుకోవాలనే ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి. మొట్టమొదటి రెవెన్యూ డే ను ఏలూరు లోన్ రెవెన్యూ భవనం నందు నిర్వహించిండం జరిగింది. ఈ రెవెన్యూ దినోత్సవ వేడుకలకు జిల్లా నలుమూలల నుండి రెవెన్యూ ఉద్యోగులు మరియు రిటైర్డ్  రెవెన్యూ అధికారులు మరియు ఉద్యోగులు హాజరవ్వగా  ఖాజవలి, రెవెన్యూ డివిజనల్ అధికారి, ఏలూరు వారు ముఖ్య అతిథిగా హాజరై, రెవెన్యూ శాఖ చరిత్రను, విశిష్టతను కూలంకుషంగా  వివరించి, ఎప్పటికపుడు ప్రజలకు ఇంకా మంచి సేవలు అందించేలా చట్టాల పై అవగాహన కలిగి ఉండాలని కోరారు.ప్రజలతో రెవిన్యూ ఉద్యోగులు సత్సంబంధాలు కొనసాగించాలని, ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రభుత్వ పధకములు ప్రజలకు చేరువ చేయడంలో రెవిన్యూ శాఖ ముందుండాలని కోరియున్నారు. ఈ రోజే రెవెన్యూ డే ఎందుకు జరుపుకుంటున్నాము అనే విషయాన్ని వివరించి సభను ప్రారంభించిన జిల్లా కార్యదర్శి ప్రమోద్ కుమార్ .తదుపరి సభాధ్యక్షులు ,రెవెన్యూ సంఘా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ .వి. రాజేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి రెవెన్యూ అధికారి వరకూ బోర్డర్ లో సైనికుడు వలె అలుపన్నది లేకుండా పౌరులకు సేవలందించడంలో 24×7 శ్రమిస్తారని కొనియాడారు. జిల్లా యంత్రాంగంతో దృష్టికి తీసుకుని వెళ్లి, రెవెన్యూ ఉద్యోగులకు శిక్షణ కొరకు త్వరలోనే ఏలూరు కేంద్రంగా ఒక జిల్లా స్థాయి శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా కృషి చేస్తామని తెలిపారు. రెవెన్యూ చట్టాల పై అవగాహన చేసుకోవడం ద్వారా దైనందిన విధి నిర్వహణలో పని విత్తిడిని అధికమించాలని కోరారు. రిటైర్డ్ తహశీల్దారు మరియు రెవెన్యూ సాంఘ రాష్ట్ర మాజీ  సహాధ్యక్షులు వి.వి.జగన్మోహన్ రావు మాట్లాడుతూ వారి సర్వీసు కాలంలో దైనందిన విధుల్లో ఎదురైనా అనేక సంఘటనలను ఉదాహరణగా చెప్తూ క్షేత్ర స్థాయిలో మెలకువగా పని చేయాలని. కక్షిదారుల సమస్యలు పరిష్కరించడంలో చట్టాలను నూటికి నూరు శాతం అమలు చేయాలని సూచన చేశారు. రిటైర్డ్ తహశీల్దారు ఏం.హెచ్. మణి మాట్లాడుతూ ప్రతీ ఒక్క రెవెన్యూ ఉద్యోగి డ్రాఫ్టింగ్ పై పట్టు సాధించాలని…  కోర్టు ఉత్తర్వులను అమలు పరచడంలో జాగ్రత్తతో ఉండాలని కోరారు. వారి సేవలు ఉద్యోగులకు రెవెన్యూ చట్టాల పై అవగాహన/శిక్షణా  కార్యక్రమాలు చేయడానికి అవసరమని  రెవెన్యూ సంఘం నాయకులు కోరగా. విద్యాదానం గొప్ప దానమని,  ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉద్యోగులకు శిక్షణా కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేశారు.రెవెన్యూ శాఖలో పనిచేసిన కాలంలో పౌరులకు విశిష్ట సేవలందించి రెవిన్యూ శాఖ ఔన్నత్యాన్ని ఇనుమడింపజేసినవిశ్రాంత తహశీల్దార్లు వి.వి.జగన్మోహనరావు, ఏమ్.హెచ్. మణి,బి. బెన్నీ, ఎస్. సత్యనారాయణ, జీ.జే.ఎస్.కుమార్, రామకృష్ణ, శ్రీ ఆర్. పోతురాజు,  సీతారాం ను మరియు విశ్రాంత ఆఫీసు సబార్డినేట్  రాఘవులును దుశ్శాలువాతూ సత్కరించి గౌరవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కె.రవి చంద్ర, జాయింట్ సెక్రటరీ  మాధవి, కార్యనిర్వహక కార్యదర్శి శ్రీను నాయక్, జాయింట్ సెక్రటరీ మల్లేశ్వరరావు, ఈ.సి మెంబరు ఎన్.వి.డి.వి.ప్రసాద్ బాబు, ఏలూరు డివిజన్ అధ్యక్షులు కృష్ణ స్వామి, ఏ. పి .జే.ఏ.సి అమరావతి మహిళా విభాగం కార్యదర్శి బలుసు గీతిక మరియు జిల్లా నలుమూలల నుండి వచ్చిన రెవెన్యూ ఉద్యోగులు, గ్రామా రెవిన్యూ అధికార్లు, వార్డు రెవిన్యూ సెక్రెటరీస్, గ్రామ సర్వే సహాయకులు, గ్రామ రెవిన్యూ సహాయకులు  పెద్ద ఎత్తున హాజరైనారు.

About Author