PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాజీమార్గమే రాజ మార్గం- జూనియర్ సివిల్ జడ్జి ఎంఎస్ భారతి 

1 min read

జాతీయ లోక్ అదాలత్ లో 84 కేసులు పరిష్కారం.

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : కేసుల పరిష్కారంలో పక్షిదారులకు రాజీ మార్గమే రాజ మార్గం అని జూనియర్ సివిల్ జడ్జి ఎంఎస్ భారతి స్పష్టం చేశారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు శనివారం  పత్తికొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జూనియర్ సివిల్ జడ్జి ఎంఎస్. భారతి  ఇరు వర్గాల కక్షిదారులను విచారించి 84 కేసులను పరిస్కరించినట్లు క్లర్క్ రాఘవేంద్ర తెలిపారు. ఇందులో క్రిమినల్ కేసులు-54, సివిల్ కేసులు -14, ఈపీ కేసులు -11, గృహ హింస కేసులు – 3, భరణం కేసులు    -2 ఉన్నట్లు ఆయన తెలిపారు.  ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ, రాష్ట్ర  హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టు లో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో  జాతీయ లోక్ అదాలత్ నిర్వహించామన్నారు. పెండింగ్ కేసులు సత్వరమే పరిస్ఖరించడమే లోక్ అదాలత్ ఉద్దేశ్యం అన్నారు. ఈ కార్యక్రమం లో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రంగస్వామి, ప్రధాన కార్యదర్శి మహేశ్, లోక్ అదాలత్ న్యాయవాదులు నాగభూషణం రెడ్డి, రమేష్ బాబు, న్యాయవాదులు ఎల్లారెడ్డి, సురేష్ కుమార్, సత్యనారాయణ, హుల్తెన్న, ఈరన్న, మల్లికార్జున,  సురేంద్ర,  కృష్ణయ్య, జటంగిరాజు, రవి ప్రకాష్, బాలభాష, నారాయణ స్వామి వెంకటేశ్వర్లు, ప్రసాద్ బాబు, మధుబాబు, దామోదర ఆచారి, సూరజ్ నబి, శ్రీకాంత్ రెడ్డి, రాజశేఖర్, వాసు, భాస్కర్, అరుణ్, హరిక్రిష్ణ,రజాక్ పాల్గొన్నారు.

About Author