PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జూనియర్ వైద్యురాలు అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలి

1 min read

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కే బాబురావు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఆర్‌జీకార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలు మౌమిత దేబనాద్ హత్యాచార ఘటన బాధాకరమని దీని తీవ్రంగా ఖండిస్తున్నమని కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కే బాబురావు ఒక పత్రికా ప్రకటనలో తెలియజేశారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయం నుండి విడుదల చేసిన పత్రిక ప్రకటనలో బాబురావు గారు మాట్లాడుతూ రోజు రోజుకి మహిళలపై కామాంధుల అత్యాచార్యులు పెరిగిపోతున్నాయని 78 సంవత్సరాల ఈ స్వతంత్ర భారత దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దిశ, నిర్భయ, ఫోక్సో చట్టం ఇలా ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ ఎటువంటి రక్షణ లేదని, తల్లి జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మ నిస్తారని అటువంటి డాక్టర్స్ పై హత్య చేసి అత్యాచారం జరపడం చాలా బాధాకరమన్నారు. తక్షణమే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. డాక్టర్స్ కే రక్షణ లేకపోవడం దురదృష్ట కరమని, డాక్టర్ గా ఆమెకు న్యాయం జరగాలని అలాగే ఇలాంటి ఘటనలు జరుగకుండా  కఠినమైన చర్యలు తీసుకోవాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని, మహిళలు ఎన్నో ఆశలతో వైద్య వృత్తిలోకి వస్తారని, పేషెంట్స్ కి వైద్యం చేసి మంచి చేయాలనీ భావిస్తారని,ట్రైని వైద్యురాలు సైతం ఎండీ కోర్స్ లో అత్యధిక మార్కులు సాధించి గోల్డ్ మెడల్ సాధించాలని ఆ వైపుగా అడుగులు వేసిందని తెలిపారు.

వైద్య వృత్తిలో ఉండి ఎందరికో సేవ చేయాలనీ భావించిందని

కానీ మానవ మృగం చేతిలో చిక్కి బలి ఆయిందన్నారు. ఆ కుటుంబానికి కావాల్సింది పరామర్శ కాదని  న్యాయం చేయాలన్నారు. వెంటనే ఈ ఘటనకు కారణమైన వారిని  కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గత పది సంవత్సరముల నుండి మహిళలపై హత్యలు అత్యాచారాలు ఎక్కువయ్యాయని, మహిళలపై జరుగుతున్న ఈ అఘాయిత్యాల పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కఠిన చట్టాలు తీసుకురావాలని తెలిపారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని అన్నారు అలాగే వైద్య విద్యార్థిని కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

About Author