జూపాడు బంగ్లా…స్మశాన వాటికలో కల్వర్ట్ కాలువ తవ్వడం ఆపాలి..
1 min readపల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: 5 వందల కుటుంబాలకు అర్థ ఎకరాలో స్మశానమా*..సీపీఐ విమర్శ……. పాములపాడు మండలం కృష్ణరావుపేటలో ఉన్న 500 కుటుంబాల మైనార్టీ సోదరులకు అర్థ ఎకరాలో స్మశానమా అని ఏ విధంగా సరిపోతుందని అర్థ ఎకరంలో కూడా కాలువ పేరుతో ఆక్రమణకు గురి చేస్తున్నారని జాతీయ రహదారి అధికారులు తక్షణమే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని, వీరికి రెండు ఎకరాలలో స్మశాన వాటికకు భూమి కేటాయించాలని *సిపిఐ జిల్లా నాయకులు ఏం రమేష్ బాబు జిల్లా కలెక్టర్ ను కోరారు. బుధవారం కృష్ణరావు పేట గ్రామ మైనార్టీ దూదేకుల కులస్తులు మండల తాహసిల్దార్ గారికి వినతి పత్రం అందించి, నిరసన తెలిపారు*.. స్పందించిన తహసిల్దార్ సర్వేయర్ లను పంపించి సమస్యను అడిగి తెలుసుకున్నారు.. సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ రహదారి పనులలో కృష్ణరావు పేట గ్రామానికి చెందిన మైనార్టీ,దూదేకుల చెందిన 500కుటుంబాలు ఉన్నారని వారికి అర ఎకరం లో స్మశానం గత 30 సంవత్సరాలనుండి ఉన్నదన్నారు.ఇప్పుడు జాతీయ రహదారి పనులలో మైనార్టీలను సంప్రదించకుండా ఏకపక్షంగా అధికారులు సాగునీటి కాలువ తవ్వడానికి సిద్ధపడటం వల్ల దాదాపు 20సెంట్లు దాకా స్మశానం పోతుందన్నారు. తక్షణమే వారికి ప్రత్యామ్నాయంగా రెండు ఎకరాల స్మశానాన్ని కేటాయించి భూమి ఇవ్వాలన్నారు. వక్ఫుబోర్డ్ భూములు అన్ని అక్రాంతం అవుతున్నాయని అయినా కూడా మైనారిటీల జీవితాలు మారడం లేదన్నారు.. తక్షణమే స్మశానానికి రక్షణ కవచం ఏర్పాటు చేసి ఆక్రమణ కాకుండా చూడాలని వారు కోరారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల నాయకులు పుల్లయ్య, రమణ, గ్రామ మైనార్టీ నాయకులు సైఫుదిను, మూర్తు జవలి, భాష తదితరులు పాల్గొన్నారు.