PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జూపాడుబంగ్లా పోలీస్ స్టేషన్ తనిఖీ..

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా పోలీస్ స్టేషన్ ను నందికొట్కూరు రూరల్ సీఐ టి సుబ్రహ్మణ్యం గురువారం సాయంత్రం తనిఖీ చేశారు.పలు కేసుల వివరాల గురించి ఎస్సై లక్ష్మీనారాయణ ను సీఐ అడిగి తెలుసుకున్నారు.పలు రికార్డులను సీఐ తనిఖీ చేసి ఫిర్యాదు దారులు పోలీస్ స్టేషన్ కు వస్తే వెంటనే వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించే విధంగా ఉండాలని మండలంలో ఎక్కడైనా సరే మట్కా జూదం నాటు సారా అమ్మడం వంటి వాటిపై నిఘా ఉంచాలని ఇలాంటి వాటి పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీస్ సిబ్బందికి సీఐ సూచించారు. మండలంలోని సమస్యా త్మక గ్రామాలపై దృష్టి ఉంచాలని అన్నారు.

About Author