1998 డీఎస్సీలో నష్టపోయిన వారికి న్యాయం చేయండి
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ : 1998 డీఎస్సీలో నష్టపోయి 2023 లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా ఓపెస్ మెరిట్ లో ఉద్యోగాలు ఇవ్వడం వల్ల మరోసారి నష్టపోయిన బీసీ, ఎస్సీ, వికలాంగులు మహిళా అభ్యర్థులకు న్యాయం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను అని ఎస్సీ రైల్వే బోర్డ్ సలహా మండలి సభ్యులు, ఓబీసీ సంఘం జాతీయ అధ్యక్షులు అంగీరేకుల వరప్రసాద్ యాదవ్ కోరారు. స్థానిక గాంధీనగర్ ప్రెస్క్లబ్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ,1998 డిఎస్సీ లోనే ఓసి వారికి మొదటిగా 50 మార్కులు బిసి వారికి 45 మార్కులు ఎస్సీ వారికి 40 మార్కులు( కట్ ఆఫ్ )గా నిర్ణయించి ప్రకారం ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారని, కానీ ఆయా కేటగిరీల్లో తగినంత మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు అర్హత సాధించలేకపోవడం వల్ల ఓసి వారికి 45, బిసి వారికి 40 ,ఎస్సి వారికి 35 మార్కులుగా నిర్ధారించి ఇంటర్వ్యూకు పిలిచారని, అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2023 ఏప్రిల్ నెలలో ఓపెస్ మెరిట్ ప్రాతిపదికగా 1998 డీఎస్సీ వారికి ఎం డి ఎస్ పద్ధతిలో ఉద్యోగాలు ఇవ్వడం వల్ల ,(8 )జిల్లాల్లో ఉన్న బీసీ, ఎస్సీ ,వికలాంగులు మహిళా అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని క్యారీ ఫార్వర్డ్ పోస్టులు కొన్ని జిల్లాలకు న్యాయం చేసి ఆనాడు మన పోస్టులను ప్రామాణికంగా తీసుకుని , కనీసంఆయా కేటగిరీలో మెరిట్ ప్రాతిపదిక ఇవ్వకుండా అలాగే రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా ఓపెన్ మెరిట్ లో ఇవ్వడం ద్వారా ఉద్యోగం అవసరం ఉన్నవారికి రాకుండా పోయాయని ఆయన అన్నారు. రిజర్వ్ కుటుంబాలకు అన్యాయం చేసి రోడ్డుమీద పడేశారని సర్టిఫికెట్ వెరిఫికేషన్ కారణంగా ఒరిజినల్ సర్టిఫికెట్లు తాము అప్పటికే పని చేస్తున్న పాఠశాలల నుండి వెనక్కి తీసుకుని రావడం వల్ల అటు ప్రైవేటు ఉద్యోగంలోనూ, ఇది ఎం టీఎస్ టీచర్ ఉద్యోగము రాకపోవడం వల్ల ఎంతో దుర్భర పరిస్థితిలో జీవనం సాగిస్తున్నారని ,ఆయన అన్నారు ఉద్యోగం చేరడానికి ఇష్టం ఉన్నవారు తమ విల్లింగ్ ఇవ్వాలని ప్రభుత్వం ఆన్లైన్లో వెబ్సైట్ ఓపెన్ చేసిందని ఇందులో 6,800 మంది అభ్యర్థులు విల్లింగ్ ఇచ్చారని, 6,200 మంది సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకున్నారని , విల్లింగ్ మెమో నెంబర్ జీవో నెంబర్ 27లో ఎలాంటి నిబంధనలు ఓపెస్ మెరిట్ ప్రకారం జాబ్ ఇస్తామని తెలుపలేదని ఆయన అన్నారు. కానీ అపాయింట్మెంట్ మెమోలో మాత్రం కేవలం ఓపెస్ మెరిట్ ద్వారా సెలెక్ట్ చేశారు, కాబట్టి బీసీ ,ఎస్సీ ,మహిళా వికలాంగ అభ్యర్థులకు, (8)జిల్లాల్లో పూర్తిగా అన్యాయం జరిగిందని, గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల 2000 మంది ఉద్యోగాలు రాక వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ . శ్రీనివాసులు కార్యవర్గ సభ్యులు, ఎం. చెన్న కృష్ణయ్య ట్రెజరర్ తదితరులు పాల్గొన్నారు.