మాజీ సైనికుల వారసులకు న్యాయం చేయాలి
1 min readఅక్రమంగా కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
జయరాజు,నరేంద్ర బాధితులు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు మండలం,రుద్రవరం,మిలిటరీ కాలనీలోని మాజీ సైనికుల వారసులమైన తమకు న్యాయం చేయాలనీ బాధితులు జయరాజు,నరేంద్ర,గ్రామ ప్రజలు కోరారు.ఈ మేరకు సోమవారం నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వారు మీడియాతో మాట్లాడారు.1950లో రెండవ ప్రపంచ యుద్ధంలో పనిచేసిన సైనికులు 72మందికి 222బి-2ఎ -5బి సర్వే నంబర్ లో 0.9ఎకరాలు స్థలం కేటాయించి మిలిటరీ కాలనీ పేరును నామకరణం చేసినట్లు చెప్పారు.గ్రామంలో మిగిలిన భూమిని కొందరు అక్రమంగా నకిలీ పత్రాలు సృష్టించి,రిజిస్ట్రేషన్ లు చేయించుకోవడం జరిగిందని అన్నారు.ఈ విషయంలో గ్రామస్తులు న్యాయపరంగా పోరాడుతున్నట్లు పేర్కొన్నారు.అయితే ఆక్రమణదారులు ఇది సహించలేక తహసీల్దార్ కార్యాలయం వద్ద తనపై దాడి చేసినట్లు ఆవేదన చెందారు.కావున అధికారులు పూర్తిగా విచారణ చేపట్టి అక్రమణకు గురైన భూమిని స్వాదినం చేసుకొని,గ్రామంలోని మాజీ సైనికుల వారసులకు సమానంగా పంపిణీ చేయాలనీ డిమాండ్ చేశారు.అదేవిదంగా తమపై దాడికి పాల్పడిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మాసుం, నారాయణ,రాజయ్య,సుబ్బన్న,అభిమన్యు సింగ్,నరేంద్ర,రవి,మౌలాలి,కళావతి, అయ్యమ్మ, కాంతమ్మ,ఎస్తేరమ్మ,సులోచన, నర్సమ్మ,తదితరులు పాల్గొన్నారు.