కష్టపడే కార్యకర్తలకు ఎప్పటికైనా న్యాయం జరుగుతుంది..
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: తెలుగు దేశం పార్టీ కార్యాలయము నందు కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కా రెడ్డి ఆధ్వర్యంలో కర్నూలు ఇన్చార్జి మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు,కర్నూల్ అసెంబ్లీ కర్నూల్ మినిస్టర్ టీజీ భరత్ ,పర్యటన సందర్భంగా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో, ఆదోని ఇంచార్జి మీనాక్షి నాయుడు, ఎమ్మిగనూరుఇన్చార్జి బివి జయ నాగేశ్వర్ రెడ్డి ఆలూరి ఇంచార్జి వీరభద్ర గౌడ్, కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి, కోడుమూరు తెలుగుదేశం నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి ,ఎమ్మెల్యే గౌరుచరితా రెడ్డి, గౌరు వెంకట్ రెడ్డి ,పత్తికొండ ఎమ్మెల్యే కె యిశ్యాంబాబు, నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్,సోమిశెట్టి వెంకటేశ్వర్లు,ధరూరు జేమ్స్, సత్రం రామకృష్ణ, సాంస్కృతిక విభాగం అధ్యక్షులు పి హనుమంతరావు చౌదరి ఆర్గనైజర్ సెక్రెటరీ లక్ష్మీ పద్మా చౌదరి పాల్గొని మంత్రులు కార్యాలయానికి వచ్చిన సందర్భంగా పూలమాలలు వేసి వారికి శాలువాలతో సన్మానించడం జరిగింది. కష్టపడే కార్యకర్తలకు ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని ఈ పర్యటన సందర్భంగా నాయకులకు కార్యకర్తలకు హామీ ఇవ్వడం జరిగింది ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి కలిసికట్టుగా పనిచేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ప్రధానమంత్రి మోడీ కి మంచి పేరు తీసుకురావడం కోసం ప్రజలను మంచిగా పరిపాలించడం కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని మంత్రులు తెలియజేశారు.