ఏలూరు ఎక్సైజ్ సీఐ గా కె ధనరాజ్ బాధ్యతలు
1 min readపల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : జిల్లాలో అన్ని శాఖల అధికారులు బదిలీల క్రమంలో భాగంగా ఏలూరు మధ్యనిషేధ అబ్కారి శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా కె ధనరాజ్ ఆదివారం ఏలూరు కార్యాలయంలో బాధ్యతల స్వీకరించారు. సీఐ ధనరాజ్ ప్రస్తుతం విజయవాడ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో లో విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఏలూరు ఎక్సైజ్ సిఐ పనిచేసిన ధనరాజ్ అనంతరం గత ప్రభుత్వం ఎస్ ఈ బి ఏర్పాటు చేయడంతో ఎస్ ఈ బి టాస్క్ ఫోర్స్ సిఐ గా పని చేశారు. జిల్లావ్యాప్తంగా ఎస్ ఈ బి టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో పేకాట, కోడిపందాలు, నాటు సారా, అక్రమ మద్యం తరలింపు కేసులను చేదించి సమర్థవంతమైన అధికారిగా ఉన్నత అధికారుల మన్ననలు అందుకున్నారు. అనంతరం విజయవాడలో ఎస్ ఈ బి లో పనిచేసీ బదిలీపై ఏలూరు జిల్లాకు విచ్చేశారు. నూతన బాధ్యతలు చేపట్టిన ఎక్సైజ్ సి ఐ ధనరాజ్ ను పలువురు అధికారులు సిబ్బంది అభినందించారు.