జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన కె.వెట్రి సెల్వి
1 min readస్వాగతం పలికిన జిల్లా అధికారులు
జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తా
పోలవరం మొదటి ప్రాధాన్యత
ప్రజా ఫిర్యాదులు తనకు స్వయంగా 9491041488 నెంబర్ కి ఫోన్ చేసి తెలపవచ్చు
జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు జిల్లా కలెక్టర్ గా కె.వెట్రి సెల్వి బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం కలెక్టరేట్ చేరుకున్న ఆమెకు జిల్లా అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ ఛాంబర్లో ప్రవేశించి, బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వికు జాయింట్ కలెక్టర్ బి.లావణ్య వేణి, ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి ఎం. సూర్యతేజ డిఆర్వో డి.పుష్ప మణి, ఆర్డీవో లు ఎన్ ఎస్ కె ఖాజా వలి,కె.ఆద్దయ్య, కలెక్టరేట్ పరిపాలనాధికారి కె. కాశీ విశ్వేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు, రెవెన్యూ,తదితర ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ ను కలిసి పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, జిల్లా అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తానని, అన్ని రంగాల్లో అభివృద్ధి పథాన నడిపిస్తానని చెప్పారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా కార్యక్రమాలను ముందుకు తీసుకు వెళతామని అన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో తన ప్రాధాన్యతలను కలెక్టర్ తెలియజేసారు. పోలవరం ప్రాజెక్ట్ తన తోలి ప్రాధాన్యతన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా ప్రజల ఫిర్యాదులను సత్వరమే పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. ప్రజల తమ సమస్యలను నేరుగా తన ఫోన్ 9491041488 నెంబర్ కు తెలియజేయవచ్చన్నారు. జిల్లా లో పారిశుధ్యం మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధి కి పనిచేసి రాష్ట్రంలోనే ఏలూరు జిల్లాను అత్యుత్తమ స్థాయిలో నిలిపేందుకు కృషిచేస్తానన్నారు. జిల్లా కలెక్టర్ గా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వం నకు కలెక్టర్ వెట్రి సెల్వి ధన్యవాదాలు తెలియజేసారు.