PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కడుమూర్-పైపాలెం రహదారికి మోక్చమెన్నడో

1 min read

20 ఏళ్ల క్రితం రోడ్డు పట్టించుకునే వారేరి

రోడ్లు వేయాలని కోరుతున్న ప్రజలు

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని కడుమూరు- పైపాలెం గ్రామాల రహదారి అధ్వానంగా తయారు కావడం వల్ల వాహనదారులు కింద పడుతూ ఉండడం పడడం వల్ల గాయాల పాలవుతున్నామని ఎన్నో ఏళ్ల 20 సంవత్సరాల క్రితం వేసిన రహదారి ఇప్పుడు గుంతల మయంగా మారడంతో రహదారిని పట్టించుకునే నాధుడే కరువయ్యారని గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయ్  అధికారులూ మారుతున్నారు..పాలకులూ మారుతున్నారు వారు గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చారు వాళ్లు వెళ్లారు.కడుమూరు,పై పాలెం,నాగలూటి,49 బన్నూరు,చౌటుకూరు తదితర గ్రామాల ప్రజలు అంతేకాకుండా నందికొట్కూరు నుండి ఓర్వకల్లు కు అతి దగ్గరగా ఈ వైపునే ప్రజలు అధికంగా వెళ్తూ ఉన్నారు.రెండున్నర కిలోమీటర్లు రోడ్డు గుంతలు గుంతలుగా ఉండడంతో ఎక్కడ ఏమి జరుగుతుందోనన్న భయం ఉందని ప్రయాణికులు అంటున్నారు.ఈ సార్వత్రిక ఎన్నికలకు ముందు మిడుతూరు మండల సర్వసభ్య సమావేశాల్లో ఈ రోడ్డుకు నిధులు మంజూరు అయ్యాయని స్వయంగా సంబంధిత అధికారులే చెప్పినా ఇంతవరకు ఆ రోడ్డు పనులు ప్రారంభించకపోవడం విశేషం.  ఇప్పటికైనా అధికారులు ఈ రోడ్డును సందర్శించి రోడ్డు వేయాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.పీరుసాహెబ్ పేట-మిడుతూరు మిడుతూరు రోడ్డు..కడుమూరు-బన్నూరు మరియు నంద్యాల ప్రధాన రహదారి రోడ్డు,ఓర్వకల్లు రహదారి కూడా గుంతల మయంగా ఉంది ఈ రోడ్ల  మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

About Author