కమనీయం శ్రీ కరి వీరభద్రేశ్వర స్వామి రథోత్సవం
1 min readముఖ్య అతిథిగా హాజరైన టిటిడి పాలకమండలి సభ్యులు వై సీతారామిరెడ్డి
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : మండల పరిధిలోని కలుదేవకుంట గ్రామంలో వెలసిన శ్రీ కరి వీరభద్రేశ్వర స్వామి రథోత్సవం ఆలయ ధర్మకర్తల అధ్వర్యంలో కమనీయం గా సాగింది. మంగళవారం శ్రీ కరి వీరభద్రేశ్వర స్వామి ఆరాధన సందర్భంగా ఆలయ ధర్మకర్త రాఘవరెడ్డి ఆధ్వర్యంలో ఆలయంలో ఉదయం నుండి శివ పార్వతుల మూర్తులకు విశేష పూజలు నిర్వహించారు. దేవాలయాన్ని వివిధ రకాల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. సాయంత్రం గ్రామ పెద్దలు రాఘవ రెడ్డి ఇంటి నుంచి మండల ఉపాధ్యక్షురాలు సింధూ ప్రియ కుంభం మోస్తూ రథోత్సవం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా రథం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అరటి ఆకులతో పూల మాలతో కొయ్య రథోత్సవాన్ని అందంగా అలంకరిచి రథం పై శివ పార్వతుల మూర్తులను ఉంచి మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ డప్పు వాయిద్యాల మద్య పుర వీధుల్లో ఘనంగా ఊరేగించారు. ఈ కార్యక్రమానికి వైసిపి నాయకులు టిటిడి పాలకమండలి సభ్యులు వై సీతారామి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీరి కి కలుదేవకుంట వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షులు కె. రఘునాథ్ రెడ్డి గ్రామ సర్పంచ్ రవీంద్రారెడ్డి యువ నాయకులు విఖ్యాత్ రెడ్డి లు స్వాగతం పలికారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో సొసైటీ సిఇఓ వెంకటేశ్వర్లు, వెంకటేష్ తో పాటు పాటు గ్రామస్తులు వెంకటేశ్వర రెడ్డి, జగన్నాథ్ రెడ్డి, రమాకాంత్ రెడ్డి, భీమేశ్వరి రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, లక్ష్మికాంత రెడ్డి, డీలర్ నాగభూషణం రెడ్డి ఇతర తదితరులు పాల్గొన్నారు.