కమనీయం శ్రీ వీరభద్రస్వామి రథోత్సవం
1 min readఆకట్టుకున్న వీరభద్ర స్వామి, భద్రకాళి వేషధారణలు
భారిగా తరలి వచ్చిన భక్తులు, ప్రజలు
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : మండల పరిధిలోని మాధవరం గ్రామంలో వెలసిన శ్రీ వీరభద్రస్వామి మహారథోత్సవం పూజారి జంగం వీరన్న స్వామి ఆధ్వర్యంలో కమనీయం గా సాగింది. ఈ సందర్భంగా వీరభద్ర స్వామి ని ఉదయం నుండి మహిళలు, యువతులు, గ్రామ ప్రజలు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం వీరభద్రం స్వామి చిత్ర పటం ను మహారథోత్సవం పై ఆశీనులు చేసి భాజభజంత్రీల మద్య, డప్పు కళాకారుల మద్య, చిన్నారుల కోలాటాలు నృత్యాలు చేస్తూ బసవన్న కట్టా వరకు ఊరేగించారు.మహారథోత్సవం లో వీరభద్రం స్వామి, భద్రకాళి వేషధారణలు, చిన్నారుల కోలాటాలు నృత్యాలు ఎంత గానో ఆకట్టుకున్నాయి. వీరభద్రం స్వామి దేవాలయం ను వివిద రకాల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎస్సై విజయ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.