PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కన్నుల పండుగ గణనాథుడి ఊరేగింపు

1 min read

చెన్నూరు హైవే వంతెన వద్ద నిమజ్జనం కోసం అధికారులు ఏర్పాట్లు

చెన్నూరు సిఐ పురుషోత్తం రాజు ఆధ్వర్యంలో విస్తృత బందోబస్తు

పల్లెవెలుగు వెబ్  చెన్నూరు: మండల వ్యాప్తంగా ఐదు రోజులు పాటు జరిగిన వినాయక ఉత్సవాలు ఐదో రోజు చెన్నూర్ లో వినాయక ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. శివాలయం వీధి. భవాని నగర్. రాయలసీమ గ్రామీణ బ్యాంక్. కొత్త రోడ్డు. చెన్నూర్ లో పలు ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన వినాయక విగ్రహాలు ఊరేగింపు పురవీధుల గుండా బుధవారం అత్యంత వైభవంగా కొనసాగింది. ఊరేగింపులో నృత్యాలు చేస్తూ డబ్బులు వాయించుకుంటూ రంగులు వెదజల్లుకుంటూ బాణాసంచా పేలుస్తూ ఊరేగింపు కొనసాగించారు. అనంతరం చెన్నూరు హైవే వంతెన వద్ద. అలాగే చెన్నూరు కొండపేట పెన్నా నది వంతెన మధ్య వంతెన పై నుంచే విగ్రహాలను పెన్నా నదిలో నిమజ్జనం చేసేందుకు చెన్నూరు సిఐ పురుషోత్తం రాజు అలాగే మండల రెవెన్యూ అధికారులు భారీగా ఏర్పాటు చేశారు. కడప పరిసర ప్రాంతాల నుంచి విగ్రహాలు రావడంతో పురుషోత్తం రాజు ఆధ్వర్యంలో చెన్నూరు పెట్రోల్ బంకు వద్ద ప్రత్యేక చెక్పోస్ట్ ను ఏర్పాటుచేసి విగ్రహాలు తీసుకొచ్చిన వాహనాల్లో భక్తులను దించివేసి డ్రైవర్ ఇద్దరు వ్యక్తులకు మాత్రమే అనుమతించారు. హైవే వంతెన వద్ద నిమజ్జనం కోసం ఉపయోగించే ప్రోక్లైన్లు సహాయంతో వినాయక విగ్రహాలను పెన్నా నదిలోకి వదులుతున్నారు. పెన్నా నదిలో ఎవరిని దిగకుండా రెవిన్యూ అధికారులు సీఐ పురుషోత్తం రాజు ఆధ్వర్యంలో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు.

About Author