కర్ణాటక మద్యం బాటిల్లు స్వాదీనం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వారి సిబ్బంది మరియు కర్నూలు డీటీఎఫ్ ఇన్స్పెక్టర్ వారి సిబ్బంది కొల్లంపల్లి తాండ వద్ద ధాడులు జరుపగా కొల్లంపల్లి తాండ నందు నేనవత్ లోకేష్ నాయక్ అనే వ్యక్తి దగ్గర ఒకే మోటార్ సైకిల్ మరియు 36 లీటర్స్ నాటు సారాయి స్వాదీనము చేసుకొని, సదరు వ్యక్తి ని అదుపులోకి తీసుకొని కేసును నమోదు చేసినట్టు కర్నూల్ ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ కే.చంద్రహాస్ తెలిపారు. మరో కేసులో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్, కర్నూలు ఆదేశాల మేరకు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ కే.చంద్రహాస్ మరియు సిబ్బంది, ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ మరియు వారి సిబ్బంది కలిసి పరిమళ నగర్ నందు ధాడులు జరుపగా వరద శ్రీనివాసులు అను వ్యక్తి వద్ద 55 (750ml) NDPL కర్ణాటక మద్యం బాటిల్స్ ను స్వాదీనము చేసుకొని, సదరు వ్యక్తి ని అదుపులోకి తీసుకొని కేసును నమోదు చేసినట్టు కర్నూల్ ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ కే.చంద్రహాస్ తెలిపారు ఈ దాడులలో కర్నూల్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ కే.చంద్రహాస్, Sub-Inspectors K.నవీన్ బాబు మరియు కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ జయరాం నాయుడు, డీటీఎఫ్ ఇన్స్పెక్టర్ కర్నూల్ K.రాజేంద్ర ప్రసాద్ మరియు వారి వారి సిబ్బంది పాల్గొన్నారు అని తెలిపినారు.