24న నగర బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనం
1 min readకర్నూలు, పల్లెవెలుగు: తుంగాతీరంలోని హరిహర క్షేత్రం సంకల్ భాగ్ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు భవాని సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో ఈ నెల 24న నగర బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు సండేల్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం దేవాలయం ప్రాంగణంలో వనభోజనాలకు సంబంధించిన కరపత్రాలను సంఘం ఆధ్వర్యంలో విడుదల చేశారరు. ఆ తరువాత సండేల్ చంద్రశేఖర్ మీడియతో మాట్లాడారు. పవిత్ర కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది నగర బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బ్రాహ్మణ కార్తీక వన భోజనమహోత్సవాన్ని నిర్వహిస్తామని, బ్రాహ్మణ సంఘం కుల బాంధవులు కుటుంబ సమేతంగా వచ్చి కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. కరపత్రం విడుదల చేసిన వారిలో సంఘం నాయకులు, శ్రీ చల్లా నాగరాజు శర్మ, ఉపాధ్యక్షులు కంచు గంటల శ్యాంసుందర్రావు, ఉపకార్యదర్శి నాగులవరం రాజశేఖర్ రావు, కోశాధికారి సిఎస్ ప్రసాదరావు, గౌరవాధ్యక్షులు చెరువు వెంకట దుర్గాప్రసాద్, మరియు కార్యవర్గ సభ్యులు, రెంట చింతల సుధాకర్ శర్మ, టీవీ రవిచంద్ర శర్మ, M రాజేష్ శర్మ, దేవుళ్ళ విజయ్ కుమార్ శర్మ, ప్రసన్న కుమార్ శర్మ, ఉమామహేశ్వర శర్మ, గురు రాజారావు, సుబ్బారావు, రాఘవ శర్మ, శ్రీమతి గారు, బిందు, గాయత్రి గారు, శ్రీనివాసరాజు, మేనేజర్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.