పరమన్ దొడ్డి లో ఘనంగా కార్తీక మాస పండుగ
1 min readఉచ్చాయి ను లాగిన భక్తులు
పల్లకి లో ఉత్సవమూర్తి
ఆంజనేయ స్వామి ను దర్శించుకున్న భక్తులు
పల్లెవెలుగు న్యూస్ ఎమ్మిగనూరు: మండలంలో పరమాన్ దొడ్డి గ్రామంలో కార్తీక మాస పండుగ ను ఘనంగా జరుపుకున్నారు. పరమాన్ దొడ్డి గ్రామంలోని శ్రీ ఆంజేయస్వామి దేవాలయం , అలాగే గ్రామ సమీపంలో ఉన్న ఎల్ఎల్సి కాలువ దగ్గరలో ఉన్న పురాతన సాయి దొడ్డి ఆంజనేయ స్వామి దేవాలయం ను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెల రోజులు పాటు ఆడపడుచులు భక్తి శ్రద్ధలతో స్వామి వారికి నిస్టతతో ప్రత్యేక పూజలు చేశారు. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పల్లకిలో ఊరేగించారు. బాణ సంచ పేల్చి సంబరాలు జరుపుకున్నారు.స్వామి వారికి అకుపుజా చేయడంతో పాటు నందికోల సేవ చేశారు. అలాగే ఈ ఏడాది మూడవ సంవత్సరం తేరు తయారు చేయించి ఉచ్చాయి లాగారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు గొల్ల రంగన్న, గొల్ల పరమేష్ జీ నల్లారెడ్డి యాదవ్ గొల్ల రామాంజనేయులు గొల్ల నాగప్ప గొల్ల మల్లేష్ గొల్ల చిన్నమ్మ గొల్ల చిరంజీవి తెలుగు అనుమప్ప బోయ గిడ్డయ్య, బోయ వేరేష్ చాకలి పెద్ద రోగెప్ప, బోయ పెద్ద మునెప్ప,తెలుగు చాకలి నల్లన్న తో పాటు గ్రామ ప్రజలు స్వామి వారిని దర్శించుకున్నారు.