PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏలూరు వైసిపి ఎంపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్  కుమార్ నామినేషన్ దాఖలు

1 min read

ఆయన వెంట వేలాదిగా పాల్గొన్న వైసిపి కార్యకర్తలు, అభిమానులు,పార్టీ శ్రేణులు..

ఆశీర్వదించి  ఫ్యాను గుర్తుకు  ఓటేసి ఎంపీగా గెలిపించండని విజ్ఞప్తి

వైయస్ జగన్మోహన్ రెడ్డి ని ముఖ్య మంత్రిని చేయండి

పల్లెవెలుగు  ఏలూరు జిల్లా ప్రతినిధి : రానున్న సార్వత్రిక ఎన్నికలకు ఏలూరు ఎంపీ అభ్యర్థి గా  విజయం దిశగా ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ నామినేషన్ దాఖలు చేయడానికి భారీ ఊరేగింపుగా వైసిపి సైన్యంతో బయలుదేరారు. ఆయన వెంట ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని) తో కలసి నామినేషన్ దాఖలు చేయడానికి పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి వైసిపి మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు తో  వాడవాడల ప్రచారoతో   వేలాది జనసందోహoతో బయలుదేరారు. మంగళవారం పాదయాత్ర గా బయలుదేరి నామినేషన్ దాఖలు చేశారు.  నామినేషన్ కార్యక్రమానికి క్యాంప్ కార్యాలయం నుండి వేలాదిమంది కార్యకర్తలు, అభిమానులు, పార్టీ శ్రేణులు బాణాసంచా కాలుస్తూ, తీన్మార్.డప్పుల హోరుతో, కార్యకర్తల నృత్యాలతో నగరంలో పండుగ వాతావరణం తలపించేలా ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ కి గజమాలలు వేసి భారీ ఊరేగింపుగా పాదయాత్ర ప్రారంభ మయ్యింది. మీ అందరి అభిమానంతో ఎంపీ అభ్యర్థిగా నాకు, ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల నాని కి, ఒక్కసారి అవకాశం ఇచ్చి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని మరోసారి ముఖ్యమంత్రి చేయాలని శిరస్సు వంచి నమస్కరించి అభివాదాలు చేస్తూ పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్ర  ముందుగా జూట్ మిల్ సెంటర్ నుండి, ఓవర్ బ్రిడ్జి  మీదుగా. ఫైర్ స్టేషన్ సెంటర్లో బాబు జగజ్జీవన్ రామ్ కి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్, జడ్పీ సెంటర్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు కొనసాగింది. మండుటెండను సైతం లెక్కచేయకుండా ఒక జన సముద్రంల అభిమానులు, కార్యకర్తలు, మహిళలు, నీరాజనాలు పలికారు.  పాదయాత్ర గా భారీ వూరేగింపు తో చేరుకొన్నారు. పాదయాత్ర పాల్గొన్న ప్రతి ఒక్కరూ  చివరి వరకు అదే ఉత్సాహంతో జోష్ నింపారు.  మహిళలు కూడా అడుగడుగునా హరతులతో, పూల వర్షం కురిపించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరు సునీల్ కుమార్  ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ కు తన నామినేషన్ పత్రం దాఖలు  చేసారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టారు అబ్బయ్య చౌదరి, చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి కంభం విజయరాజు, కైకలూరు ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు, జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాదరావు, ఏలూరు నగరపాల సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, డిప్యూటీ మేయర్లు నూకపై సుధీర్ బాబు జి శ్రీనివాస్, డివిజన్లో కార్పొరేటర్లు, వివిధ సంఘాల నాయకులు, ఏడు నియోజకవర్గాల నుండి తరలి వచ్చిన పార్టీ శ్రేణులు మరియు అశేష జనవాహిని, అధిక సంఖ్యలో కార్యకర్తలు, పార్టీ కార్యకర్తలు అభిమానులు వేలాదిగా పాల్గొని విజయవంతం చేశారు.

About Author