PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కేసీ కెనాల్ లో మురుగు నీటిని వదిలితే చర్యలు తప్పవు

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: కేసీ కెనాల్ కు ఇరువైపులా ఉన్న కాలనీ వాసులు తమ బాత్రూములకు సంబంధించిన మురుగు నీటిని కేసీ కెనాల్ కాలువలోకి వదలరాదని అలా వధలపడం వల్ల కేసి కెనాల్ నీరు కలుషితమై పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, అలాగే పశువులకు కూడా ఇబ్బందికరంగా ఏర్పడుతుందని కాలనీ వాసులు తమ బాత్రూములకు సంబంధించిన మురుగు నీటిని డ్రైనేజిల లోనికి కానీ, లేదా ఇంకుడు గుంతలు తీసుకొని అందులోనికి వదులుకోవడం కానీ చేయాలని అలా చేయని యెడల చర్యలు తప్పవని కేసీ కెనాల్ ఏఈ, పంచాయతీ కార్యదర్శి రామ సుబ్బారెడ్డి లు కాల్ మీ వాసులను హెచ్చరించారు, మంగళవారం వారు కమలాపురం శాసనసభ్యులు పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి ఆదేశాల మేరకు కేసీ కెనాల్ కాలువ కు ఇరువైపులా ఉన్న రాజుల కాలనీ, సరస్వతి నగర్, లక్ష్మీ నగర్, గాంధీనగర్, శ్రీరామ్ నగర్ కాలనీల వాసులకు తమ ఇండ్ల నుండి వచ్చే మురుగునీరు విషయంపై అవగాహన కల్పించారు, తమ బాత్రూముల నుండి వచ్చే మురుగు నీటిని కేసీ కెనాల్ కాలువలలో వదలరాదని, ఆ నీటిని డ్రైనేజీలలో కానీ, లేదా ఇంకుడు గుంతలు తీసుకొని అందులోనికి వదలాలే తప్ప, అలాంటి మురుగునీటిని కేసి కెనాల్ లోకి వదలడం మంచిది కాదని , ఈ మురుగు నీటి వల్ల పంటలు దెబ్బతిన్నడమే కాకుండా రైతులు పూర్తిగా నష్టపోవడం జరుగుతుందని, అదేవిధంగా పశువులు కూడా కలుషిత నీటిని తాగి అనారోగ్య పాలు అవుతున్నాయని ఇకమీదట కాలనీ వాసులు మురుగు నీటిని కేసీ కెనాల్ లో వదలరాదని వారు కాలనీ వాసులను హెచ్చరించారు, మురుగు నీటిని వదలడమే కాకుండా వ్యర్థ పదార్థాలు కూడా కేసీ కెనాల్ లో వేయడం తగదని వారు కాలనీ వాసులకు తెలియజేశారు .

About Author