“కేడావరిక్ ఓథ్” (మృతదేహం పై ప్రమాణం)..
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: మరణించిన వారూ మీకు పాఠాలు చెబుతారు – మృతదేహానికి, వారి కుటుంబసభ్యులకు కృతజ్ఞత తెలపండి అని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ కర్నూల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ కే చిట్టి నరసమ్మ అన్నారు. మొదటి సంవత్సరం వైద్య విద్యార్థులకు మెడికల్ కాలేజీలోని అనాటమీ డిపార్ట్మెంట్ యందు బుధవారం “కేడావరిక్ ఓథ్” (మృతదేహం పై ప్రమాణం) నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య విద్యార్థులకు మృత దేహాలే మొదటి గురువులని అందుకే అనాటమీ డిపార్ట్మెంట్ యందు “ఇక్కడ మరణించిన వారు జీవించి ఉన్న వారికి పాఠాలు చెబుతారు” అని వ్రాసి వుంటుందన్నారు. వైద్య విద్యార్థులు మృతదేహంపై ప్రాక్టికల్స్ నిర్వహిస్తారని మానవ శరీరంలో అంతర్గతంగా ఏ,ఏ భాగాలు ఎక్కడెక్కడ వుంటాయి, ఎలా వుంటాయి అని నేరుగా చూడడం, స్పృశించడం ద్వారా తెలుసుకుంటారని కావున మరణించి కూడా వైద్య విద్యార్థులకి పాఠాలు చెబుతున్న మృతదేశానికి వారి కుటుంబ సభ్యులని గౌరవించడం వారికి కృతజ్ఞత తెలపడం వైద్యుల బాధ్యత అని తెలిపారు . అందుకే మొదటి సంవత్సరం విద్యార్థులకి ఈ కార్యక్రమని వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ లు డాక్టర్ హరి చరణ్, డాక్టర్ సాయి సుధీర్, డాక్టర్ రేణుక దేవి, డాక్టర్ విజయా నంద్ బాబు, అనాటమీ హెచ్.ఓ.డి & ప్రొఫెసర్ డాక్టర్ శోభారాణి, అసోసియేట్లు డాక్టర్ ప్రశాంతి ,సోమశేఖర్, విజయలక్ష్మి దేవి, అసిస్టెంట్ లు డా.అపర్ణ, డా.సోనీ ఝాన్సి ప్రియ తదితరులు పాల్గొన్నారు.