PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కిడ్డిస్ మార్ట్ స్టోర్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే

1 min read

టిడిపి నేత పట్టాభిరామ్

ప్రముఖ సినీ తార ప్రణీత సుభాష్

షోరూం ప్రతి ఒక్కరిని ఆకర్షించే విధంగా ఉందన్న అతిథులు

పల్లెవెలుగు వెబ్ విజయవాడ: నగరంలోని కరెన్సీ నగర్ లో ఏర్పాటు చేసిన కిడ్డీస్ మార్ట్ నూతన షోరూమ్ ను విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, టిడిపి జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్, ప్రముఖ సినీ తార ప్రణీత తో కలసి లాంచనంగా ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో షో రూమ్ ను ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడుతూ….కిడ్స్ అందరినీ ఎంతగానో ఆకర్షించే విధంగా 5000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 5000 రకాల పైన పిల్లలకు అవసరమైన వస్తువులన్నింటిని ఒకే ప్రదేశంలో ఏర్పాటు చేయటం అభినందనీయం అని కొనియాడారు. ఇంత చక్కటి షోరూమ్ ను తమ చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషకరమని పేర్కొన్నారు. కూటమి  ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో అనేక మందికి ఉపాధి అవకాశాలు మెండుగా కలిగే అవకాశం ఉందని చెప్పారు. ఇటువంటి షోరూమ్లు ఏర్పాటు అవడం ద్వారా అనేక మందికి ఉపాధి కలుగుతుందని అన్నారు.అనంతరం అత్తారింటికి దారేది ఫేమ్ ప్రణీత మాట్లాడుతూ….ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఇటువంటి షోరూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనటం చాలా సంతోషంగా ఉందన్నారు.న్యూబోర్న్ బేబీస్ ఫోటోషూట్, కిడ్స్వేర్. కిడ్స్ టోయిస్. కిడ్స్ అలంకరణ వస్తువులు అన్ని లభిస్తాయని చెప్పారు.  .పది సంవత్సరాల వయసు పిల్లల వరకు కిడ్స్ వేర్ ఇక్కడ లభిస్తుంది అన్నారు. 5000 చదరపు అడుగులలో ఏర్పాటు చేసిన ఈ స్టోరిని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని,విజయవాడ కరెన్నీ నగర్ ఆయుష్ హాస్పిటల్ సమీపంలోని రామచంద్ర నగర్ మెయిన్ రోడ్డు లో ఈ కిడ్సీస్ మార్ట్ స్టోర్ ఏర్పాటు చేశారు అని చెప్పారు.అనంతరం కిడ్డీస్ మార్ట్ ఛైర్మన్ సుబ్బారావు మాట్లాడుతూ పిల్లల తల్లిదండ్రులు వారికి కావలసిన వస్తువులన్నీ ఒకే ప్రదేశంలో ఏర్పాటు చేసి వన్ స్టాప్ షోరూమ్ నీ అందించడమే లక్ష్యంగా దీనిని ప్రారంభించమని చెప్పారు. షోరూం ప్రారంభం సందర్భంగా 20% వరకు డిస్కౌంట్ ధరలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. కస్టమర్లకు సంతృప్తి ఇవ్వాలనే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశామని ప్రజలు తమను ఆదరించాలని  కోరారు.. తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షోరూం సిబ్బందితో పాటు పలువురు పాల్గొన్నారు.

About Author